గాడిన పడని కూకట్‌పల్లి జోనల్ పాలన

మన తెలంగాణ/మూసాపేట : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతనంగా సృష్టించిన కూకట్‌పల్లి జోనల్ కార్యాలయం నుంచి పౌరులకు పాలన అందడం లేదు. జోనల్ కార్యాలయానికి అవసరమైన అధికారులు, సి బ్బందిని నియమించక పోవడం, కావల్సిన సదుపాయాలు సమకూర్చక పోవడంతో పరిపాలన గాడిన పడలేదు. జోనల్ కార్యాలయం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా పౌ రు లు జోనల్ కార్యాలయం సేవల కోసం పడిగాపులు కాస్తున్నారు. జోనల్‌కార్యాలయం ఏ ర్పాటు చేసిన నాడే […]

మన తెలంగాణ/మూసాపేట : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతనంగా సృష్టించిన కూకట్‌పల్లి జోనల్ కార్యాలయం నుంచి పౌరులకు పాలన అందడం లేదు. జోనల్ కార్యాలయానికి అవసరమైన అధికారులు, సి బ్బందిని నియమించక పోవడం, కావల్సిన సదుపాయాలు సమకూర్చక పోవడంతో పరిపాలన గాడిన పడలేదు. జోనల్ కార్యాలయం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా పౌ రు లు జోనల్ కార్యాలయం సేవల కోసం పడిగాపులు కాస్తున్నారు. జోనల్‌కార్యాలయం ఏ ర్పాటు చేసిన నాడే జోనల్ కమిషనర్‌ను మాత్రం నియమించిన జీహెచ్‌ఎంసీ అధికారు లు అందుకు కావల్సిన సదుపాయాలను, అధికారులు, సిబ్బందిని అలాట్ చేసే విషయా న్ని మాత్రం మర్చిపోయారు. జీహెచ్‌ఎంసీలో ఉన్న 5 జోన్లను విభజించి ఆరోవ జోన్ గా ఏర్పడిన కూకట్‌పల్లి జోనల్ కార్యాలయం సేవలు ఆర వ వేలుగా మారింది. మూసాపేట, కూకట్‌పలి జంట సర్కిళ్ళతో పాటు కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్ సర్కిళ్ళ ను కొ త్తగా ఏర్పడిన కూకట్‌పల్లి జోనల్ పరిధిలో ఉన్నాయి. జోనల్ కార్యాల యం స ర్కిళ్ళ పా లనా పరమైన అన్ని అంశాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగు ల జీతబత్యాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు, చేపట్టాల్సిన పనులకు సంబంధించి పరిపాలన ఆమోదం వంటి అనేక కీలక నిర్ణయాలు జోనల్ కార్యాలయ ం నుంచే జరగాల్సి ఉండటంతో జోనల్ పరిపాలన కీలకంగా మారిన విషయం తెలిసిందే.

కొలువుదీరని అకౌంట్స్ విభాగం : ప్రారంభంకాని బిల్లుల చెల్లింపు

జోనల్ కార్యాలయంలో పలు విబాగాలు ఏర్పాటు కావాల్సి వుంది. ముఖ్యంగా ఆర్ధిక పరమైన అంశాల పరిశీలనకు అకౌంట్స్ విభాగం ఏర్పాటు కావల్సి ఉంది. ఈ విభాగం ఫై నాన్స్ అడ్వయిజర్( ఎఫ్‌ఏ) అకౌంటెంట్, సూపరిండెంట్‌ల, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, 4 ఆపరేటర్లతో ఈ విభాగం పనిచేయాల్సి ఉంది. ఉద్యోగుల జీతబత్యాలు, అభివృద్ధి ప నులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు ఈ విభాగం చేపడుతుంది. జోనల్‌కార్యాలయం ఏర్పడి రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు అకౌంట్స్ , ఆడిట్ విభాగం పూర్తిగా కొలువు దీరలేదు. దీంతో మూసాపేట, కూకట్‌పల్లి సర్కిళ్ళకు సంబంధించిన ఆర్ధిక పరమైన అంశాలను వెస్ట్ జోన్ నుంచి , కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్ళ అంశాలను నార్త్ జోన్ కార్యాలయం నుంచి పరిశీలిస్తున్నారు. ఈ విభాగంలో ఇప్పటి వరకు సంబంధిత అధికారులు, సిబ్బంది నియామకం జరగక పోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. నిన్న మొన్నటి వరకు జోనల్‌కు పూర్తి స్థాయి బడ్జెట్‌ను అలాట్‌చేయడం జరగలేదని ఓ అధికారి వాపోయారు. రెండు రోజుల క్రితమే బ్యాంక్ అకౌంట్‌ను తెరిచారని, కార్యకలాపాలు మాత్రం ప్రారంభం కాలేదని అంటున్నారు.

పూర్తిస్థాయిలో కొలువు దీరని జోనల్ విభాగాలు

జోనల్ స్థాయిలో ఇంజనీరింగ్ , శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, బయోడైవర్సిటీ, వెటర్నరీ, స్పోర్ట్ విభాగాలు ఏర్పాటు కావల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఎస్‌ఈతోపాటు డిఈ, ఏఈ లు ప్రత్యేకంగా నియమించాల్సి ఉంది. కాని కేవలం ఒక్క ఎస్‌ఈని మాత్రమే నియమించారు. సద రు ఎస్‌ఈ కూడా జూన్30న పదవీ విరమణ చేశారు. జోనల్‌లో ఎస్‌ఈ స్థాయిలో కూడా అభివృద్ధి ప నులకు టెండర్లు నిర్వహించాల్సి ఉంది. టెండర్ల నిర్వాహణ కోసం సపోర్టింగ్‌స్టాఫ్ అవసరం ఉన్నా ఇంతవరకు ఆ నియామకాలు జరగలేదు. కాగా బయోడైవర్సిటీ, స్పోర్ట్ , ఎంటమాలజీ విభాగాలకు పూర్తి స్థాయి అధికారుల నియామకం జరగలేదు.

జోనల్‌లో ‘ప్లానింగ్ ’కొరత

జోనల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగం పాత్ర కీలకంగా ఉంటుంది. గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులకు అనుమతి మంజూరు చేసే అధికారం జోనల్ టౌన్‌ప్లానింగ్ విభాగానికి ఉం టుంది. అదేవిధంగా లేఅవుట్‌రెగ్యులరైజేషన్( ఎల్‌ఆర్‌ఎస్) , బిల్డింగ్ పీనలైజేష న్ ( బీపిఎస్) వంటి ఫైల్స్‌ను జోనల్ కార్యాలయంలోని డిప్యూటీ సిటీ ప్లానర్ నేతృత్వంలోని టౌన్‌ప్లానింగ్ విభాగం చేయాల్సి ఉంది. టౌన్‌ప్లానింగ్ విభాగం పర్యవేక్షణకు డిప్యూటీ సిటీ ప్లానర్‌తోపాటు ఇద్దరు ఎసీపీలు, ఇద్దరు సెక్షన్ ఆఫీసర్‌లు, ఇత సపోర్టింగ్ స్టాప్ అవసరం. కాని ప్రస్తుతం డిప్యూటీ సిటీ ప్లానర్‌తోపాటు ఒక ఎసీపీని మాత్రమే నియమించారు. కాని ఇంతవరకు జోనల్ స్థాయి అనుమతులిచ్చే ప్రక్రియ ప్రారంభం కాలేదు. కూకట్‌పల్లి, మూసాపేట, అల్వాల్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిళ్ళకు సంబంధించి ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పైళ్ళు ఇక్కడకు చేరలేదు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తు దారులు కూకట్‌పల్లి జోన్ కార్యాలయంతోపాటు పాత జోనల్‌కార్యాలయాలకు ప్రదక్షణలు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.

జోనల్ కార్యాలయానికి కావల్సిన సదుపాయాలేవి?

కూకట్‌పల్లి జోనల్ కార్యాలయానికి కావల్సిన సదుపాయాలు లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మూసాపేటలోని సర్కిల్ కార్యాలయం నుంచి కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పాలన కొనసాగుతుంది. అదనం గా జోనల్‌కార్యాలయం పాలన కూడా ఇక్కడ నుంచే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో క్రమపద్దతి లేకుండా ఎక్కడ వీలుంటే అక్కడ ఆయా విబాగాల అధికారులు, సిబ్బందికి కేటాయించి అడ్జస్ట్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు పూర్తిస్థా యి దృష్టి సారించి నిధులు కేటాయింపు జరిపి మార్పులు , చేర్పులు చేస్తే తప్ప అవస్థలు తప్పేలా లేవని సర్కిల్ అధికారులు వాపోతున్నారు.

త్వరలోనే పూర్తిస్థాయి పాలన అందిస్తాం : జెడ్సీ

జోనల్ కార్యాలయం ఏర్పడి నెలలు గడుస్తున్నా పౌరులకు సేవలందించని విషయంపై ‘మన తెలంగాణ’ జోనల్ కమిషనర్ శంకరయ్యను వివరణ కోరింది. సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు పూర్తికాక పోవడం, బడ్జెట్ అలాట్ జరగక పోవడంతో కొంత జాప్యం జరిగింది. గత వారం రోజుల నుం చి ఆయా విభాగాలు ఏర్పాటవుతున్నాయి. సౌకర్యాల కల్పన, సిబ్బంది కేటాయింపు విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి జరిగింది. కొన్ని విభాగాలకు అధికారులు వచ్చి జాయిన్ అ య్యారు. జోనల్‌కు ఇటీవలనే బడ్జెట్ అలాట్ అయ్యింది. బ్యాంక్ అకౌంట్ కూడా తెరిచాం. ట్రయల్ ప్రారంభి స్తాం. వారం పది రోజుల్లో జోనల్ పరిపాలన పూర్తి స్థాయిలో పౌరులకు అందుబాటులోకి వస్తుంది.

Related Stories: