గాజు ముక్కలతో ఒళ్లంతా కోసుకునేవాళ్లం…

పట్నా: సరైన ఆహారం పెట్టకుండా మత్తు మందు కలిపిన తిండి పెట్టేవారు. దాంతో ఉదయం లేచే సరికి ఒళ్లంతా నొప్పులతో చాలా బాధపడేవాళ్లం. ఒక్కొసారి వారు పెట్టే బాధలు భరించలేక గాజు ముక్కలతో ఒళ్లంతా గాయాలు చేసుకునేవాళ్లం. బిహార్ లోని బాలికల వసతి గృహంలో అత్యాచారాలకు గురైన బాధితుల ఆవేదన ఇది. ఈ వసతి గృహంలో 140 మందికి పైగా బాలికలు ఉన్నారు. వారిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది బాలికలపై అత్యాచారాలు జరిగాయి. […]

పట్నా: సరైన ఆహారం పెట్టకుండా మత్తు మందు కలిపిన తిండి పెట్టేవారు. దాంతో ఉదయం లేచే సరికి ఒళ్లంతా నొప్పులతో చాలా బాధపడేవాళ్లం. ఒక్కొసారి వారు పెట్టే బాధలు భరించలేక గాజు ముక్కలతో ఒళ్లంతా గాయాలు చేసుకునేవాళ్లం. బిహార్ లోని బాలికల వసతి గృహంలో అత్యాచారాలకు గురైన బాధితుల ఆవేదన ఇది. ఈ వసతి గృహంలో 140 మందికి పైగా బాలికలు ఉన్నారు. వారిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది బాలికలపై అత్యాచారాలు జరిగాయి. బాలికలను రక్షణ కల్పించాడానికి ఎన్జివో ఏర్పాటు చేసిన యజమాని కూడా నిందితుల్లో ఒకరు కావడం విశేషం. శనివారం బాలికలను రిహాబ్‌ సెంటర్లకు తరలించారు. ఈ నేపథ్యంలో బాధితుల్లో కొందరు తాము పడ్డ బాధలను మీడియాతో పంచుకున్నారు. మాకు ఎలాంటి ఆహారం పెట్టినా తినేవాళ్లమని, అందులో మాదకద్రవ్యాలు కలిపేవారని తెలిపారు. ఒక్కోసారి తిండి కూడా పెట్టకపోవడంతో ఆకలితో అలమటించేవాళ్లమని అన్నారు. తిండి తిన్నాక మత్తుగా ఉండడంతో వెంటనే నిద్రపోయేవాళ్లం. ఉదయం లేచే సరికి నోట మాట సరిగ్గా వచ్చేది కాదు. మాపై అత్యాచారాలు చేస్తున్నారని తెలుసి పారిపోదామంటే ఓపిక ఉండేది కాదని చెప్పారు. మత్తుగా అనిపించడంతో కాసేపు నిద్రపోదామంటే కడుపులో తన్నేవారు. మాలో చాలా మంది అనాథలు. వసతి గృహంలోని ఆడవాళ్లు కూడా మాకు సహకరించేవారు కాదు. చెప్పాలంటే అక్కడికి వచ్చే మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా హింసించేవారని ఆవేధన వ్యక్తం చేశారు.

Related Stories: