గవర్నర్‌ను కలిసిన కెసిఆర్

CM KCR Meets Governor Narasimhan

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలిశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం ఏకవాక్య తీర్మానం చేసింది. రెండు నిమిషాల్లోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మంత్రివర్గ తీర్మానాన్ని సిఎం కెసిఆర్ గవర్నర్‌కు అందజేశారు. కెసిఆర్ మ.2.30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. కాసేపట్లో శాసన సభకు పోటీ చేయనున్న టిఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో  ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ ప్రముఖలు తెలుపుతున్నారు. నియోజక వర్గాల ఇన్ ఛార్జ్ లకు టిఆర్ఎస్ భవన్  నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం.

Comments

comments