గర్భిణీలకు అందించే పౌష్టికాహారం లోపం

నల్లబెల్లి: గర్బిణి స్త్రీలు మొదలుకోని పుట్టిన ఐదు సంవత్సరాల పిల్లల వరకు పౌష్టికాహారం అందించాలనే లక్షంతో కేంద్ర ప్రభుత్వం అందించే పథకాన్ని ఐసిడిఎస్ అధికారులతో పాటు అంగన్‌వాడి టీచర్స్ నిర్విర్యం చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. గర్బిణి స్త్రీలకు, బాలలకు అందించే పౌష్టికాహారాన్ని తమ కుటుంబ అవసరాలకే వాడుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మండలంలో 57 అంగన్‌వాడి సెంటర్లు ఉండగా ఒక్కో సెంటర్‌లో సుమారు బాలలు 15 నుంచి 20 మంది బాలలు ఉండాల్సి ఉండగా ఒక్కరిద్దరితోనే సెంటర్లు నడిపించుకుంటూ […]

నల్లబెల్లి: గర్బిణి స్త్రీలు మొదలుకోని పుట్టిన ఐదు సంవత్సరాల పిల్లల వరకు పౌష్టికాహారం అందించాలనే లక్షంతో కేంద్ర ప్రభుత్వం అందించే పథకాన్ని ఐసిడిఎస్ అధికారులతో పాటు అంగన్‌వాడి టీచర్స్ నిర్విర్యం చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. గర్బిణి స్త్రీలకు, బాలలకు అందించే పౌష్టికాహారాన్ని తమ కుటుంబ అవసరాలకే వాడుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మండలంలో 57 అంగన్‌వాడి సెంటర్లు ఉండగా ఒక్కో సెంటర్‌లో సుమారు బాలలు 15 నుంచి 20 మంది బాలలు ఉండాల్సి ఉండగా ఒక్కరిద్దరితోనే సెంటర్లు నడిపించుకుంటూ 15 నుండి 20 మంది బాలలు ఉన్నట్టు హాజరు పట్టిక చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నప్పటికి సంబందిత ఐసిడిఎస్, పిడి, సిడిపిఒలు పట్టించుకున్న దాఖాలు లేవని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజువారిగా పిల్లలకు అందించే పాలలో నిళ్ళు కలిపి పంపిణి చేస్తున్నట్టు సమాచారం, వండే పౌష్టికాహారంలో పప్పులు, నూనె తక్కువ మోతాదులో వాడుతున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే బుధవారం మండలంలోని కన్నారావుపేట గ్రామ శివారు బుచ్చిరెడ్డిపల్లె లోని అంగన్‌వాడి సెంటర్‌లో రోజు వారిగా గర్భిణి స్త్రీ వెళ్లగా పాలను చూసి బాగాలేవన్న నేపంతో పాల ప్యాకెట్లను పరిశీలించగా గత నెల క్రితమే కాలం ముగిసినట్టు తెలపడంతో గ్రామస్థులు అంగన్‌వాడి సెంటర్‌ను తనిఖి చేయగా తుట్టెలు కట్టిన బియ్యం, పుచ్చులు పట్టిన పప్పు, కాలం ముగిసిన పాల ప్యాకెట్లు దొరకినట్టు గ్రామస్థులు తెలిపారు. దీనిపై స్థానిక అంగన్‌వాడి టీచర్ గుగులోతు రమాదేవిని వివరణ అడగగా నీళ్లు మ్రింగుతూ సరైన సమాధానం ఇవ్వలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండలంలోని అన్ని కేంద్రాలను తనిఖి చేసి పసి పిల్లలను, గర్భిణి స్త్రీలను ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Related Stories: