గరుకుల ప్రిన్సిపల్ ప్రశ్నాపత్రంపై టిఎస్‌పిఎస్సి కీలక నిర్ణయం

TSPSC

హైదరాబాద్: గరుకుల ప్రిన్సిపల్ ప్రశ్నాపత్రం వివాదంపై టిఎస్‌పిఎస్సి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గురుకుల ప్రిన్సిపల్ పరీక్షలో పేపర్-1లో 12, పేపర్-2లో 55 ప్రశ్నలను తొలగించినట్లు ప్రకటించింది. ప్రైవేటు బ్లాగులోని పలు ప్రశ్నలు ఈ పరీక్షలో యథాతథంగా వచ్చినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఫిర్యాదు మేరకు టిఎస్‌పిఎస్సి విచారణ చర్యలు తీసుకుంది. ప్రశ్నాపత్రం రూపొందించిన ఎగ్జామినర్‌పై చర్యలు తీసుకోవాలని టిఎస్‌పిస్సి నిర్ణయించింది.