గద్వాల కోటలో దూసుకుపోతున్న కారు

Gadwal is a car in the castle Tossing

నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ రాక
గద్వాలలో భారీ బహిరంగ సభ
ప్రత్యర్థి పార్టీల్లో గుబులు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే లక్షం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ :  రాజకీయాలకు వేదికగా ఉన్న నడిగడ్డ గద్వాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు రానున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల సమీకరణకు నేతలు సభా వేదికను సిద్దం చేశారు.సుమారు లక్ష మందికి పైగా ప్రజ లు హాజరు కావచ్చునని అంచనా వేస్తునారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారు. ఈ బహిరంగ సభ ప్రత్యర్థి పార్టీలకు వణు కు పుట్టించేలా ఉండబోనుందని టిఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ సభ రాజకీయంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారనుంది. ఈ జిల్లాలో అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు కాంగ్రెస్ నియోజకవర్గాలు కావడం గమనార్హం. కాంగ్రెస్ కోటలో గులాబి జెండాలను రెపరెపలాడించాలన్న లక్షంతో టిఆర్‌ఎస్ రాజకీయ ఎత్తులకు బీజం వేయనుంది. గద్వాలలో కాంగ్రెస్ సీనియర్ నేత డికె అరుణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండగా, అలంపూర్‌కు సంపత్‌కుమార్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. రాజకీయంగా వీరి ప్రాధాన్యతను తగ్గించి వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించేలా రాజకీయంగా బలమైన ఎత్తుగడులతో టిఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందు లో భాగంగానే ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోని అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, గట్టు, మండలాలతో పాటు, గద్వాలలోని ధరూర్ వంటి మండలాలను తీసుకొని అక్కడి సాగునీటి వసతులు కల్పించేందుకు రెం డు ప్రధాన ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ హయాంలో ఆర్‌డిఎస్ పూర్తిగా నిరాదరణకు గురైంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి సిఎం చంద్రబాబునాయుడు దత్తత తీసుకుంటానని చెప్పినప్పటికీ ఆర్‌డిఎస్ రైతులకు న్యాయం జరగలే దు. ఆర్‌డిఎస్ కింద సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందాల్సినప్పటికీ కనీసం 5వేల ఎకరాలకు నీరు అందిన పాపాన పోలేదు. ఉమ్మడి ప్రభుత్వాల్లో కాంగ్రెస్, టిడిపిలు అధికారంలో ఉన్నప్పటికీ ఆర్‌డిఎస్ నీటి వా టా దక్కలేదు. కనీ సం ఆర్‌డిఎస్ 13వ వెంట్ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఎన్నో వేలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్‌డిఎస్ కనీసం నది పరివాహక ప్రాంతాల్లోని పల్లెల్లకు తాగేందుకు నీరు రాని పరిస్థితులు. నడిగడ్డ ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం నల్లరేగడి పొలాలతో అత్యం త సారవంతమైన పొలాలు, సాగునీటి వసతులు లేక పోవడంతో వర్షాధారంపైనే ఆధారంతో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. కాలువలు తవ్వడం, మరమ్మత్తుల పేరుతో లక్షల్లో వెనుకేసుకున్నారు తప్ప ఇక్కడ రైతులకు నీరు అందని పరిస్థితులు.పక్కనే ఉన్న సీమ ఫ్యాక్షనిస్టులు ఆర్‌డిఎస్ తూములను పగులగొట్టి నీరు తస్కరిస్తున్నా ఆ నాటి ప్రభుత్వాలు కిమ్మన లేదు. ఆంధ్రా ప్రాంతానికి చెంతనే నీరు పోతున్నా ఆర్‌డిఎస్ రైతులకు నీరు అందించలేక పోయారు. ఈ ప్రాంతం నుంచి ఎందరో నేతలు ఉన్నా ఆర్‌డిఎస్ రైతులకు న్యాయం చేయలేక పోయారు. రాజకీయంగా ఆర్‌డిఎస్ ఉపయోగపడింది తప్ప రైతులకు న్యాయం జరగలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని మంత్రి హరీష్‌రావును పురమాయించి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టించారు. కేవలం ఆర్‌డిఎస్ చివరి ఆయికట్టకు నీరంందించాలన్న ఉన్నత లక్షంతోనే ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. ఆగస్టు 15కు వారి కళ నెరవేరనుంది. అంతేకాకుండా గట్టు ప్రాంతానికి న్యాయం చేయాలన్న సంకల్పంతో గట్టు ఎత్తిపోతల పథకంకు నేడు శ్రీకారం చుడుతున్నారు.

నడిగడ్డపై టిఆర్‌ఎస్ జెండాను ఎగరవేయడమే లక్షం
నడిగడ్డలో కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న అలంపూర్, గద్వాల నియోజకవర్గాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకునే లక్షంగా టిఆర్‌ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆ ప్రాంత ప్రజలను మనసులను గెలుచుకుంటోంది. కరువు ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తూనే మరో వైపు పార్టీని బలోపేతం చేసే దిశ గా నేతలు అడుగులు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ రెండు నియోజకవర్గాలపై మంత్రి హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధ వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అబ్రహాంను టిఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ బలోపేతం అయ్యింది.అక్కడే స్థానికంగా ఉన్న మరో యువనేత పరోక్షంగా కూ డా టిఆర్‌ఎస్ అభ్యర్థికే మద్దలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.అదే విదంగా గద్వాల నియోజకవర్గంలోనూ టిఆర్‌ఎస్ గెలుపుకు కృషి చేసే అవకాశాలు ఉన్నాయి. స్థానికంగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇతర పార్టీలలోని నేతలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోన్నునారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా బహిరంగ సభలో ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి.ఏది ఏమైనా గద్వాల కోటలో గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్షంతో టిఆర్‌ఎస్ ముందుకు కదులుతోంది.