గత ట్రైకార్ యూసీలు అందించండి : ఐటిడిఏ పిఓ

మన తెలంగాణ/భధ్రాచలం : గత రెండేళ్లకు సంబంధించి ఐటిడిఏ నుండి ట్రైకార్ పథకం ద్వారా గిరిజనులకు అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వాటికి సంబంధించిన యూసి లను అందించడంలో సంబంధిత అధికారులు, ఎంపిడిఓలు చొరవతీసుకోవాలని  ఐటిడిఏ పిఓ పమేలా సత్పథి అన్నారు. బుధవారం ఐటిడిఏ  సమావేశపు మందిరంలో యూసిల పెండింగ్‌లపై ట్రైకార్ అధికారులు, అన్ని మండలాల ఎంపిడిఓలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ గిరిజనుల మేలు కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు […]

మన తెలంగాణ/భధ్రాచలం : గత రెండేళ్లకు సంబంధించి ఐటిడిఏ నుండి ట్రైకార్ పథకం ద్వారా గిరిజనులకు అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వాటికి సంబంధించిన యూసి లను అందించడంలో సంబంధిత అధికారులు, ఎంపిడిఓలు చొరవతీసుకోవాలని  ఐటిడిఏ పిఓ పమేలా సత్పథి అన్నారు. బుధవారం ఐటిడిఏ  సమావేశపు మందిరంలో యూసిల పెండింగ్‌లపై ట్రైకార్ అధికారులు, అన్ని మండలాల ఎంపిడిఓలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ గిరిజనుల మేలు కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి వారి అభివృద్ధికి కృషి చేస్తోందని, ఆ పథకం ఎలాంటి అవకతవకలకు లోనుకాకుండా ఉండాలంటే అధికారులు క్షేత్రస్థాయి నుండి క్రమపద్దతిలో అమలు చేసేందుకు పాటుపడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న యూసిలను అందించడంలో వేగం పెంచాలన్నారు. ఈ సారి పశుసంవర్ధక, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా వివిధ యూనిట్లు మంజూరు చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 695 యూనిట్లకు గానూ సబ్సిడీ మంజూరైందని, గ్రౌండింగ్ కమిటీల ద్వారా అమలు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బ్యాంకుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు లీడ్ బ్యాంకు మేనేజర్ కృషి చేయాలని పిఓ ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లెక్క ప్రకారం హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటిడిఏ పరిపాలనాధికారి భీమ్, ఎస్‌వో సురేష్ బాబు, ఇజిఎస్ ఏపిడి బలరామ్, పిసా కో ఆర్డినేటర్ అనీల్, ఎంపిడిఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Related Stories: