గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారు: తలసాని

సిద్దిపేట: జిల్లాలోని ప్రజ్ఞాపూర్‌లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపి వినోద్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి కాంగ్రెస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనతో తామేదో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కానీ వారు అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోనుందని తలసాని జోస్యం చెప్పారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఆ పార్టీ చేసిందేమీ […]

సిద్దిపేట: జిల్లాలోని ప్రజ్ఞాపూర్‌లో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపి వినోద్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి కాంగ్రెస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనతో తామేదో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కానీ వారు అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోనుందని తలసాని జోస్యం చెప్పారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఆ పార్టీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు. గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారని తలసాని చూరకలంటించారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు స్థానాల్లో ఉన్న బిజెపికి 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కదని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తలసాని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు రాబోయే ఎన్నికల్లో తిరిగి టిఆర్ఎస్ కు పట్టం కట్టడం ఖాయమన్నారు.

Related Stories: