పార్కింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధాన సమస్యగా మారింది. దానికితోడు పోలీసులు వేస్తున్న ఫైన్లు కట్టలేక పోతున్నారు వాహనదారులు. మాములుగా కార్ పార్కింగ్ ధర 10 నుంచి 50 రూపాయలు ఉండటం మనం చూసుంటాం.. కానీ కోట్లల్లో పార్కింగ్ టికెట్ ఉంటుందని తెలుసా…. హాంగ్‌కాంగ్‌లో పార్కింగ్ స్పేస్ మార్కెట్ ధర ఏరోజుకు ఆరోజు విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా ఓ పార్కింగ్ స్పేస్ ధర రూ. 5.6 కోట్ల (ఇండియన్ కరెన్సీలో). భూమి మీద ఏడవ అతి పెద్ద దేశం కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. జనాభా పరంగా రెండవ అతి పెద్ద దేశం అయినప్పటికీ, పార్కింగ్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. కానీ అక్కడక్కడ కొన్ని నగరాల్లో పార్కింగ్ సమస్యలు లేకపోలేదు. అయితే, హాంగ్‌కాంగ్ వంటి పొరుగు దేశాలతో పోల్చుకుంటే భారతీయులు అదృష్టవంతులనే చెప్పాలి. అక్కడ కారు కొనడం సమస్య కాదు, ఆ కారుకు సరిపడా పార్కింగ్ స్పేస్ కొనుగోలు చేయడమే అసలైన సమస్య. సగటు పార్కింగ్ ప్రదేశం ధరే ఎక్కువగా ఉంది. హాంగ్‌కాంగ్‌లో పార్కింగ్ స్పేస్ మార్కెట్ ధర ఏరోజుకు ఆరోజు విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన పార్కింగ్ స్పేస్ కూడా ఇదే. ప్రపంచ వ్యాప్తంగా బాగా అభివృద్ది చెందిన చిన్న చిన్న దేశాల్లో జనాభా పెరిగిపోవడం, విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఇలాంటి వాటి మార్కెట్ ఎక్కువైపోయింది. కేవలం హాంగ్‌కాంగ్ మాత్రమే కాదు, లండన్, న్యూ యార్క్ వంటి నగరాల్లో కూడా పార్కింగ్ సమస్య ఎక్కువైపోతోంది. భారత్‌లో కూడా పలు మెట్రో నగరాల్లో వ్యక్తిగత వాహనాల సంఖ్య అధికమవ్వడంతో పార్కింగ్ సమస్య తీవ్రమవుతోంది. ఇప్పుడు పార్కింగ్‌కి ఇబ్బందులు అవ్వడంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు స్మార్ట్ పార్కింగ్‌ని అమలుచేస్తున్నారు.
ఖరీదైన కార్ పార్కింగ్
పార్కింగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధాన సమస్యగా మారింది. దానికితోడు పోలీసులు వేస్తున్న ఫైన్లు కట్టలేక పోతున్నారు వాహనదారులు. మాములుగా కార్ పార్కింగ్ ధర 10 నుంచి 50 రూపాయలు ఉండటం మనం చూసుంటాం.. కానీ కోట్లల్లో పార్కింగ్ టికెట్ ఉంటుందని తెలుసా…. హాంగ్‌కాంగ్‌లో పార్కింగ్ స్పేస్ మార్కెట్ ధర ఏరోజుకు ఆరోజు విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా ఓ పార్కింగ్ స్పేస్ ధర రూ. 5.6 కోట్ల (ఇండియన్ కరెన్సీలో). భూమి మీద ఏడవ అతి పెద్ద […]