క్షణికావేశంలో యువతి ఆత్మహత్య…!

అమరావతి: తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని క్షణికావేశంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఎపిలోని విజయవాడ సింగ్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఇటీవలే బెంగళూరులో మల్టీమీడియా పూర్తి చేసిన సింగంపల్లి నిహారిక అనే యువతి ప్రస్తుతం తల్లిదండ్రులతో నగరంలోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు నిహారిక తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. అయితే అందుకు వారు నిరాకరించడంతో మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. నిహారిక తల్లి గవర్నర్‌ పేట పిఎస్లో ఎఎస్‌ఐ పనిచేస్తుండగా, తండ్రి గన్నవరం పిఎస్లో కానిస్టేబుల్‌గా విధులు […]

అమరావతి: తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని క్షణికావేశంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఎపిలోని విజయవాడ సింగ్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఇటీవలే బెంగళూరులో మల్టీమీడియా పూర్తి చేసిన సింగంపల్లి నిహారిక అనే యువతి ప్రస్తుతం తల్లిదండ్రులతో నగరంలోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు నిహారిక తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. అయితే అందుకు వారు నిరాకరించడంతో మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. నిహారిక తల్లి గవర్నర్‌ పేట పిఎస్లో ఎఎస్‌ఐ పనిచేస్తుండగా, తండ్రి గన్నవరం పిఎస్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: