క్రికెటర్ శ్రీకాంత్ కృష్ణమాచార్య పాత్రలో…

‘నా పేరు సూర్య’ విడుదలై నెలలు గడిచిపోతున్నా కూడా అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. తన నెక్స్ సినిమాతో పెద్ద హిట్‌ను అందుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాన్ని బన్నీ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం విషయంలో అతను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్‌కు బాలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అతని […]

‘నా పేరు సూర్య’ విడుదలై నెలలు గడిచిపోతున్నా కూడా అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. తన నెక్స్ సినిమాతో పెద్ద హిట్‌ను అందుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాన్ని బన్నీ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం విషయంలో అతను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్‌కు బాలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అతని నెక్స్ మూవీ బాలీవుడ్ సినిమానే అని అంటున్నారు. అయితే బాలీవుడ్ మూవీలో బన్నీ చేసేది ఫుల్‌లెంగ్త్ హీరో పాత్ర కాదని కేవలం గెస్ట్ రోల్ అని తెలిసింది. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న కపిల్ బయోపిక్ మూవీలో బన్నీ కనిపించనున్నాడట. కపిల్‌దేవ్ సారధ్యంలో ఇండియా ప్రపంచకప్ సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెరకెక్కే చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కపిల్‌దేవ్ పాత్రలో రణవీర్‌సింగ్ కనిపించబోతున్నాడు. ప్రపంచకప్ గెలుచుకున్న టీం సభ్యులందరి పాత్రలను కూడా ప్రముఖ నటులతో చేయించాలని దర్శకుడు కబీర్‌ఖాన్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే నిన్నటి తరం క్రికెటర్ శ్రీకాంత్ కృష్ణమాచార్య పాత్రకు గాను అల్లుఅర్జున్‌ను సంప్రదించినట్లుగా తెలిసింది. బన్నీ సినిమాలు యూ ట్యూబ్‌లో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రికార్డులు సాధించాయి. అందుకే అతను హిందీలో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిసింది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటిస్తే తెలుగులో మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని ఫిల్మ్‌మేకర్స్ భావిస్తున్నారట.

Related Stories: