క్యాబ్ డ్రైవర్‌పై కత్తితో దాడి..

Cab driver was person arrested murder by a knife
మాదాపూర్ : క్యాబ్ డ్రైవర్‌ను తల్వార్‌తో బెదిరించి చంపేస్తానన్న మరో కారు నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాయదుర్గంకు చెందిన పాంగి భీమన్న క్యాబ్ డ్రైవర్‌గా ఒలా సంస్థలో తన కార్ టిఎస్ 07 యుబి 8862ను నడుపుతు పని చేస్తూ జీవిస్తున్నారు. తన ఒలా క్యాబ్‌కు బుకింగ్ రావడంతో కస్టమర్‌ను కారులో ఎక్కించుకోని మాదాపూర్‌లోని రహేజా మైండ్ స్పేస్‌లోని  నెంబర్ 14 గల బిల్డింగ్ లో కస్టమర్‌ను వదలడానికి వేళ్ళుతున్న సమయంలో మార్గ మద్యలో బిఎస్‌ఎన్‌ఎల్ కార్యలయం వద్ద తన కారుకు  రోడ్డుపై ఎడమవైపు డివైడర్ ప్రక్కన ఇనుప రాడ్ ఉన్నందున తన కార్‌ను కుడి ప్రక్కకు తీసుకోగా అదే సమయంలో వెనుకాల నుంచి పంజాబ్ రాష్ట్రంకు చెందిన వ్యక్తి మాదాపూర్ కాకతీయ హిల్స్‌లో నివాసం ఉంటు బిజినెస్ చేస్తున్నాడు. కాగసఫారి సిహెచ్ 01 బిసి 7903 నెంబర్‌ల కారు నడుపుతున్న సహిత్ కౌర క్యాబ్ ముందుకు తన సఫారిని తీసుకువచ్చి కార్‌లోంచి కిందకు దిగి తన కార్‌లో ఉన్న తల్వార్‌ను పట్టుకోని క్యాబ్ డ్రైవర్ భీమన్న ఛాతిపైన పెట్టి కార్ నడపడానికి రాద, నా కార్ ముందుకు ఒక్క సారిగా ఎందుకు వచ్చావురా చంపేస్తానని బెదిరించడం జరిగిందని అందుకు క్యాబ్ డ్రైవర్ భీమన్న ఫిర్యాదు మేరకు అతనిపై 1959 ప్రకారం సెక్షన్ 25(1) క్రైం నెంబర్ 688/2018, 341,506ల కింద కేసు నమోదు చేసి సహిత్‌కౌరను రిమాండ్ తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు.

Comments

comments