క్యాన్సర్ వ్యాధితో వ్యక్తి మృతి

ముత్తారం: మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన వెంకన్న (50) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెల్పిన వివరాల ప్రకారం మృతుడు వెంకన్న చాల కాలం నుండి ఓడేడు బస్టాండ్‌లో చిన్న హోటల్ నడుపుకుంటూ కుటుంబ పోషణ నడిపిస్తున్నాడు. గ్రామంలో హోటల్ వెంకన్నగా అందరికి సుపరిచితుడు, గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అనేక దవాఖానలలో వైద్యం చేయించుకున్నాడు. వైద్య ఖర్చుల కోరకు తాను ఉంటున్న ఇంటిని సైతం అమ్ముకున్నాడు. […]

ముత్తారం: మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన వెంకన్న (50) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెల్పిన వివరాల ప్రకారం మృతుడు వెంకన్న చాల కాలం నుండి ఓడేడు బస్టాండ్‌లో చిన్న హోటల్ నడుపుకుంటూ కుటుంబ పోషణ నడిపిస్తున్నాడు. గ్రామంలో హోటల్ వెంకన్నగా అందరికి సుపరిచితుడు, గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అనేక దవాఖానలలో వైద్యం చేయించుకున్నాడు. వైద్య ఖర్చుల కోరకు తాను ఉంటున్న ఇంటిని సైతం అమ్ముకున్నాడు. వ్యాధి ముదరడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. గ్రామంలో మృతుడికి ఇల్లు లేకపోవడంతో తాను నడుపుతున్నా హోటల్ ముందు శవాన్ని వెసుకొని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడి కుటుంబాని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: