కోహ్లీ.. అశ్విన్‌ను ఆడించు: గంగూలీ

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీలో లంక చేతిలో టీమిండియా ఓటమి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. దీంతో ఆదివారం సఫారీలతో జరుగనున్న మ్యాచ్‌లో భారత జట్టు పక్కా వ్యూహంతో బరిలోకి దిగాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించారు. దీనిలో భాగంగా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించాలని కెప్టెన్ కోహ్లీని సూచించినట్లు తెలుస్తోంది. ఇవాళ్టి మ్యాచ్ భారత్‌కు చావోరేవో లాంటింది. కనుక టీమిండియా సఫారీలపై పైచేయి సాధించాలంటే పర్‌ఫెక్ట్ ప్లాన్ ఉండాల్సిందే. గత మ్యాచ్‌లో […]

లండన్: ఛాంపియన్స్ ట్రోఫీలో లంక చేతిలో టీమిండియా ఓటమి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. దీంతో ఆదివారం సఫారీలతో జరుగనున్న మ్యాచ్‌లో భారత జట్టు పక్కా వ్యూహంతో బరిలోకి దిగాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించారు. దీనిలో భాగంగా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించాలని కెప్టెన్ కోహ్లీని సూచించినట్లు తెలుస్తోంది.

ఇవాళ్టి మ్యాచ్ భారత్‌కు చావోరేవో లాంటింది. కనుక టీమిండియా సఫారీలపై పైచేయి సాధించాలంటే పర్‌ఫెక్ట్ ప్లాన్ ఉండాల్సిందే. గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్లు రాణించిన బౌలర్ల వైఫల్యంతో ఏకంగా 322 పరుగుల లక్ష్యాన్ని కూడా భారత్ కాపాడుకోలేక చతికిలబడింది. ఈ నేపథ్యంలోనే దాదా.. అశ్విన్‌ను ఆడించడం మంచిదనే సూచన చేశాడు. అలాగైతే ప్రస్తుతం జట్టులో ఉన్నా రవీంద్ర జడేజాను రిజర్వు బెంచ్‌కు పరిమితం చేయాలి కదా. అంటే దీనికి దాదా ఓ సూచన చేశాడు.

హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి అశ్విన్‌ను తీసుకుని ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగితే టీమిండియాకు సత్ఫలితానిస్తుందని గంగూలీ వివరించాడు. భారత బౌలింగ్ కూడా బలంగా తయారవుతుందనేది దాదా అభిప్రాయం. దాదా సలహాకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ కూడా మద్దతు తెలిపాడు. ఎలాగు ప్రధాన మ్యాచ్‌లలో సఫారీలు తడబడటం ఇంతకుముందు చాలా సందర్భాల్లో జరిగింది. కావున భారత జట్టు సఫారీల వీక్‌నెస్‌ను ఉపయోగించుకుని ఫలితాన్ని రాబట్టాలి.

Comments

comments

Related Stories: