కోహ్లీని తొందరగానే పెవిలియన్‌ పంపవచ్చు

బర్మింగ్‌హామ్: భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్‌  బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎడ్గ్‌బాస్టన్‌ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్ జట్టు సభ్యులకి కొన్ని సూచనలు చేశాడు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని  వీలైనంత తొందరగా పెవిలియన్ బాటపట్టించాలని వాగన్ సూచించాడు. కోహ్లీకి బంతులు కసిగా విసరండని, కోహ్లీ […]

బర్మింగ్‌హామ్: భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్‌  బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎడ్గ్‌బాస్టన్‌ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్ జట్టు సభ్యులకి కొన్ని సూచనలు చేశాడు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని  వీలైనంత తొందరగా పెవిలియన్ బాటపట్టించాలని వాగన్ సూచించాడు. కోహ్లీకి బంతులు కసిగా విసరండని, కోహ్లీ బ్యాటింగ్‌కు రాగానే స్టువర్ట్ బ్రాడ్, అండర్‌సన్ రంగంలోకి దింపి లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కోహ్లీని కట్టడి చేయాలని చెప్పాడు. కోహ్లీ కోసం రూట్ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలి… కోహ్లీ ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడకుండా అడ్డుకొని, బంతుల్ని ఎక్కువగా సైడ్ ఆఫ్ స్టంప్‌ వైపు విసరాలని  సలహా ఇచ్చాడు. బంతి వికెట్ల నుంచి దూరంగా పోతుందా లేదా అని సందేహాన్ని కోహ్లీని కలిగిస్తే తొందరగానే పెవిలియన్‌ పంపవచ్చని మైఖేల్  పేర్కొన్నాడు.