కోల్‌కతా నగర నేపథ్యంలో…

Sharvanand

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘పడి పడి లేచే మనసు’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోల్‌కతా నగరం నేపథ్యంలో ఉంటుంది. లవ్‌స్టోరీ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మురళీశర్మ, సునీల్, ప్రియదర్శి, ప్రియారామన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః జయకృష్ణ గుమ్మడి, ఎడిటర్‌ః ఎ.సిక్కర్ ప్రసాద్, కొరియోగ్రఫీః రాజు సుందరం.

Comments

comments