కోర్టులోనే షర్ట్ మార్చుకున్నమహిళా ప్లేయర్..!(వీడియో)

Alize Cornet changing shirt on court is Viral: US Open 2018

న్యూయార్క్: ఈ నెల 27న యుఎస్ ఓపెన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా  ఫ్రెంచ్ క్రీడాకారిణి అలైజ్ కార్నెట్ అనుకోకుండా చేసిన ఒక పని ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం పది నిమిషాల విరామాన్ని ప్రకటించారు. ఆ సమయంలో కార్నెట్ మైదానంలోనే తన టాప్ ను మార్చుకుంది. అసలేం జరిగిందంటే… కార్నెట్ తన తొలి మ్యాచ్ ని జొహన్నా లార్సన్(స్వీడన్) తో ఆడుతున్న వేళ, తన టాప్ ను సరిగ్గా ధరించకుండా కోర్టులోకి వచ్చేసింది. అది కాస్తా విరామ సమయంలో గుర్తించిన ఆమె మైదానంలోనే టాప్ తీసి సరిచేసుకుంది. అయితే, మైదానంలో తన బట్టలు మార్చుకోవడం, లోదుస్తులు పైకి కనిపించడంతో చైర్ అంపైర్ తప్పుబట్టడంపై ప్రస్తుతం దుమారంగా మారింది. ఈ విషయమై కార్నెట్ క్రీడా నిబంధనలను ఉల్లంఘించిందని హెచ్చరించారు చైర్ అంపైర్. డబ్ల్యూటిఎ నిబంధనల ప్రకారం, మహిళలు కోర్టులో దుస్తులు మార్చుకునేందుకు వీలు లేదు. పురుషులకు మాత్రం ఈ నిబంధన ఉండదు. దీంతో పురుషులకు అడ్డురాని నిబంధనలు మహిళల విషయంలో ఎందుకని మాజీలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. ఆటలో అందరూ సమానులేనని, క్రీడాస్ఫూర్తిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Comments

comments