కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా మారరా?

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు  ఎల్.రమణ టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు బిసి రిజర్వేషన్లపై అఖిలపక్షంతో చర్చించాలి ప్రభుత్వ తప్పిదాలను ఇతరులపై నెట్టడం సరికాదు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మనతెలంగాణ/జగిత్యాల: టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను న్యాయస్థానాలు తప్పు పడుతూ మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వ తీరు మారడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ అన్నారు. శుక్రవా రం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతూ, ఈ నాలుగేళ్ల […]

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు  ఎల్.రమణ

టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
బిసి రిజర్వేషన్లపై అఖిలపక్షంతో చర్చించాలి
ప్రభుత్వ తప్పిదాలను ఇతరులపై నెట్టడం సరికాదు
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ

మనతెలంగాణ/జగిత్యాల: టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను న్యాయస్థానాలు తప్పు పడుతూ మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వ తీరు మారడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ అన్నారు. శుక్రవా రం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతూ, ఈ నాలుగేళ్ల టిఆర్‌ఎస్ పాలన లో ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ న్యా యస్థానాలు 42సార్లు మొట్టికాయలు వేసిందన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం నిజాయితీ, చిత్తశుద్ది లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం కల్పించేందుకు స్వ ర్గీయ నందమూరి తారకరామారావు కృషి చే శారని, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే నే డు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కాయన్నారు. స్థానిక సంస్థల్లో బిసిల రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వం విఫలం కాగా ఆ తప్పిదాన్ని ప్రతిపక్షాల మీదికి నెట్టడం ముఖ్యమంత్రి కెసిఆర్‌కే చెల్లిందన్నారు. బిసి రిజర్వేషన్లు సాధించుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నా రు. సుఫ్రీం కోర్టుకు వెళ్లినా ఈ సమస్య పరిష్కారం కాదని,రాజ్యాంగ పరంగా, చట్టబద్ధం గా వ్యవహరించినప్పుడే బిసిలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయమై అఖిలపక్షంతో సమావేశం నిర్వహించి సలహాలు, సూ చనలు తీసుకోవాలన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఇష్టానుసారంగా వ్యవహరించడం వ ల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రమణ పేర్కొన్నా రు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేస్తామ ని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చుతున్నారన్నారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడే నాటికి రూ.68వేల కోట్ల అప్పులు ఉంటే అవి నేడు రెండు లక్షల కో ట్లకు చేరాయన్నారు. ఈ నాలుగేళ్లలో రూ. 5.50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా రా ష్ట్రంలోని సమస్యలు మాత్రం సమస్యలుగానే మిగిలిపోయాయన్నారు. మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపిల సలహాలు, సూచనలు స్వీకరించకుండా,సచివాలయానికి రాకుండా ఫాం హౌజ్, ప్రగతిభవన్ నుంచి పాలన కొనసాగించడం వల్ల అజమాయిషీ లేకుండా పోతోందన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చ ర్చించాలన్నారు.
స్థానిక సంస్థల్లో బిసిలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రియల్ ఎస్టేట్ మాఫియా ఎన్నికల్లో చొరబడే అవకాశం ఉందన్నారు.
భావ సారూప్య పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతాం…
రానున్న ఎన్నికల్లో భావ సారూప్య పార్టీలను కలుపుకుని టిడిపి ముందుకు సాగుతుందని రమణ అన్నారు.పొత్తుల విషయమై విలేకరు లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ 1993 నుంచి 2014 వరకు భావ సారూప్య త గల పార్టీలతో కలిసి టిడిపి పని చేసిందని, తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం తీసుకొ చ్చే విధంగా వచ్చే ఎన్నికల్లో కూడా తమతో కలిసి వచ్చే పార్టీలతో చర్చించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుం టామన్నారు.
బడుగు, బలహీన వర్గాల చేతిలో రాష్ట్ర అధికారం ఉండాలనే లక్షంతో తమ పార్టీ ముం దుకు పోతోందన్నారు.ఈ సమావేశంలో టి డిపి జిల్లా అధ్యక్షుడు ఆయిల్నేని సాగర్‌రావు, నాయకులు మహంకాళి రాజన్న, బాలె శం కర్,వొల్లెం మల్లేశం,అనుమల్ల జయశ్రీ, ద యాల మల్లారెడ్డి, నవ్వోతు రవీందర్, నిరంజ న్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: