కోతుల దాడితో విద్యార్థికి తీవ్ర గాయాలు

మధిర రూరల్: మండల పరిధిలోని మాడుపల్లి గ్రామంలో  కోతుల దాడితో విద్యార్థి తీవ్ర గాయాలపాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మడుపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ముల్లగిరి అనే విద్యార్థిపై స్కూల్‌కు వెళ్తుండగా అటుగా వెళ్తున్న కోతులు ఒక్కసారిగా దాడి చేయటంతో ఆ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు విద్యార్థిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థి పై కోతులు దాడి […]

మధిర రూరల్: మండల పరిధిలోని మాడుపల్లి గ్రామంలో  కోతుల దాడితో విద్యార్థి తీవ్ర గాయాలపాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మడుపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ముల్లగిరి అనే విద్యార్థిపై స్కూల్‌కు వెళ్తుండగా అటుగా వెళ్తున్న కోతులు ఒక్కసారిగా దాడి చేయటంతో ఆ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు విద్యార్థిని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థి పై కోతులు దాడి చేయటంపై స్థానికులు అధికారులపై మండిపడ్డారు. ప్రజల సమస్యలను తీర్చటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు కొరుతున్నారు.

Related Stories: