కొల్లాపూర్‌లో జూపల్లి పర్యటన

నాగర్‌కర్నూలు : తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు గ్రామాల్లో ఆయన కంటి వెలుగు, రైతు బీమా పథకాలపై సమీక్ష చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను సందర్శించి , స్థానిక ప్రజలతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సింగపట్నం చెరువు కింద వరినాట్లు వేస్తున్న వారితో కలిసి ఆయన నాట్లు వేశారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. […]

నాగర్‌కర్నూలు : తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు గ్రామాల్లో ఆయన కంటి వెలుగు, రైతు బీమా పథకాలపై సమీక్ష చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను సందర్శించి , స్థానిక ప్రజలతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సింగపట్నం చెరువు కింద వరినాట్లు వేస్తున్న వారితో కలిసి ఆయన నాట్లు వేశారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడారు. తెలంగాణలో కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని ఆయన టిఆర్‌ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Minister Jupally Tour in Kollapur

Comments

comments

Related Stories: