కొలువు దీరిన కొత్త పంచాయతీలు

వరంగల్ రూరల్  : నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలలో నూతన కళ ఉట్టిపడింది. ప్రజలు సంబురాలు చేసుకున్నారు. పండుగ వాతావరణంలో నూతన పంచాయతీ కార్యాలయాలను అట్టహసంగా జన సందోహం మధ్య ప్రారంభమైనాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని 15 మండలాలలో కొత్త, పాత గ్రామపంచాయతీలు కలిపి 401 ఉన్నాయి. అయితే గతంలో జిల్లాలో 265 గ్రామ పంచాయతీలుండగా ప్రభుత్వం నూతనంగా మరో 136 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఎంతో కాలంగా గుర్తింపు లేకుండా గూడేలుగా, […]


వరంగల్ రూరల్  : నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలలో నూతన కళ ఉట్టిపడింది. ప్రజలు సంబురాలు చేసుకున్నారు. పండుగ వాతావరణంలో నూతన పంచాయతీ కార్యాలయాలను అట్టహసంగా జన సందోహం మధ్య ప్రారంభమైనాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని 15 మండలాలలో కొత్త, పాత గ్రామపంచాయతీలు కలిపి 401 ఉన్నాయి. అయితే గతంలో జిల్లాలో 265 గ్రామ పంచాయతీలుండగా ప్రభుత్వం నూతనంగా మరో 136 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఎంతో కాలంగా గుర్తింపు లేకుండా గూడేలుగా, పల్లెలుగా, అవాసాలుగా, తండాలుగా ఉన్నటువంటి వాటికి ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా గుర్తింపు నివ్వడంతో నూతన పంచాయతీలలోని ప్రజలు హరించారు.

గ్రామ సర్పంచ్‌ల పదవి కాలం ముగిసిపోవడం, స్థానిక ఎన్నికలు అనివార్యంగా వాయిదా పడటంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలనకు శ్రీకారం చుట్టింది. గురువారం స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభ కావడంతో కేటాయించబడిన అధికారులు లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పాత వాటితో కలిపి నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీలలోనూ స్పెషల్ ఆఫీసర్ల పాలన గురువారం ప్రారంభం కావడంతో నూతన గ్రామపంచాయతీలలో పండుగ వాతావరణం నెలకొంది. చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్నట్లుగా నూతన పంచాయతీల ప్రజలు భావించారు. గ్రామస్తులంతా కలిసి సంబురాలు చేసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నూతన కార్యాలయాలు ప్రారంభం చేసుకున్నారు.

డప్పు చప్పుళ్ళు , కళారూపాలతో కళాకారులు నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలలో ఆడి పాడారు. ప్రతి ఇంట్లో పెండ్లిలా భావించి గ్రామ ప్రజలందరూ పండుగ వాతావరణంలో నూతన పంచాయతీలను కొలువుదీర్చుకున్నారు. ప్రత్యేకంగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు సాధారణంగా స్వాగతం పలికారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమక్షంలో సభలు నిర్వహించి, నూతన కార్యాలయాలను అలంకరించి ప్రారంభం చేసుకున్నారు. ఇంత కాలం గుర్తింపు లేని గ్రామాలు ఇక నుంచి గుర్తింపులో ఉండే విధంగా ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు ఇక నుంచి పెద్ద దిక్కు ఉంటుందని, తమ ఉనికి శాశ్వతంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

స్పెషల్‌గా బాధ్యతలు చేపట్టిన అధికారులు సైతం తమ గ్రామ అభివృద్ది కోసం కృషి చేయాలని కోరుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలలో నూతనంగా ఏర్పటైన కటాక్షాపూర్ గ్రామ పంచాయతీ ప్రారంభ కార్యక్రమంలో పరకాల ఎంఎల్ఎ చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. నూతన పంచాయతీ కార్యాలయ ప్రారంభాన్ని గ్రామ ప్రజలు వేడుకలా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తం ప్రజా ప్రతినిధులు పలు చోట్ల పాల్గొని నూతన పంచాయతీల ప్రారంభ కార్యక్రమాలలో భాగస్వామ్యులయ్యారు.

Related Stories: