కొర్రాజుల పటం కథ

నాయకపోడు గిరిజనుల లక్ష్మీదేవర కొర్రాజులు నాయకపోడు వారిని ఆశ్రయించి పటం ద్వారా పాండవుల కథలతో పాటు పద్మనాయకుల వృత్తాంతాన్ని చెప్తారు. ఈ కొర్రా జులనే తోటి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీరు చెప్పే నాయకపోడు వారి పుట్టుక కథలో శ్రీమహావిష్ణువు రాక్షస సంహారం చేయడానికి దేవకీ వసుదేవుల గర్భంలో జన్మించి కృష్ణావతారం దాల్చినప్పుడు లక్ష్మీదేవి శాంభవుని పట్నంలో వెండిగుడిలో జన్మిస్తుంది. ఆమె ఒక రోజున అడవిలో నడుస్తుండగా ఆమె శరీరంపై వచ్చిన చెమట కొలనులోని పద్మంపై […] The post కొర్రాజుల పటం కథ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నాయకపోడు గిరిజనుల లక్ష్మీదేవర

కొర్రాజులు నాయకపోడు వారిని ఆశ్రయించి పటం ద్వారా పాండవుల కథలతో పాటు పద్మనాయకుల వృత్తాంతాన్ని చెప్తారు. ఈ కొర్రా జులనే తోటి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీరు చెప్పే నాయకపోడు వారి పుట్టుక కథలో శ్రీమహావిష్ణువు రాక్షస సంహారం చేయడానికి దేవకీ వసుదేవుల గర్భంలో జన్మించి కృష్ణావతారం దాల్చినప్పుడు లక్ష్మీదేవి శాంభవుని పట్నంలో వెండిగుడిలో జన్మిస్తుంది. ఆమె ఒక రోజున అడవిలో నడుస్తుండగా ఆమె శరీరంపై వచ్చిన చెమట కొలనులోని పద్మంపై పడగా ఐదుగురు పుత్రులు జన్మిస్తారు. ఆ రకంగా పద్మం నుండి జన్మించిన వారు కాబట్టి పద్మనాయకులు అయ్యారని కనిపిస్తుంది.

గిరిజన తెగల్లో ఒకటైన నాయకపోడు వారి ఇలవేల్పు లక్ష్మీదేవర. ఈ దేవర ప్రతిరూపం గుర్రం తల ఆకారంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వర్షాలు సకాలంలో కురవాలని, గూడెం లో దీర్ఘకాలిక రోగాలు నయం కావాలని వేడుకుంటూ తమ మూల సంస్కృతిని అనుసరిస్తూ జాతర జరుపుకుంటారు. ఈ పండుగను గత విశ్వాసాల ఆధారంగా జరుపుకొంటున్నా సామాజిక సామూహిక మనుగడకు దోహదం చేస్తుంది.

నాయకపోడు వారు తెలంగాణలో ఆదిలాబాద్ ,నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతంలోని గోదావరి తీరంలో ఎక్కువగా ఉన్నారు. వీరిని వ్యవహారంలో నాయకు లు, నాయకపు, నాయకపోళ్లుగా పిలుస్తారు. వీరు మాత్రం తమకు తాము పాండవ నాయకులు లేదా పద్మ నాయకులుగా చెప్పుకుంటారు. పూర్వం వీరిని బోయలు గా పిలిచేవారు. వీరికి స్వతంత్ర బోయ రాజ్యాలు ఉండేవి. వీటినే బోయ దుర్గాలు లేదా బోయకొట్టాలు గా పిలిచేవారు. పూర్వం ముస్లింల పాలనకు వ్యతిరేకంగా ప్రోలయనాయకుని నాయకత్వంలో గోదావరి నది తీర ప్రాంతంలోని మాల్యవంత పర్వత ప్రాంతంలో రేఖపల్లి రాజధానిగా నాయక రాజ్యాన్ని, సింగబోయుని నాయకత్వంలో రాచకొండ రాజధానిగా పద్మనాయక రాజ్యాన్ని స్థాపించి పరిపాలన సాగించారు.

 

 

ఈ నాయకరాజ్యాల లోని వారే నాయక గిరిజనులు. నేటికీ నాయకరాజ్యాలు ఏలిన ప్రోలయనాయకున్ని, సింగ బోయు న్ని పూజిస్తారు. పూర్వం నుండి పోడు వ్యవసాయమే . వీరి ప్రధానంగా జీవనవ్యాపకం కావడంతో నాయకపోడు పేరు స్థిరపడిందని ఆదివాసీ నాయకపోడు హక్కుల పోరాట సమితి పోడుదెబ్బ వ్యవస్థాపకుడు దబ్బ సుధాకర్ చెప్పారు. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేసే కాలంలో నాయకపోడు నివాసాలకు పాండవులు వచ్చారని, అటవిక జీవనం గడిపే వీరికి పోడు వ్యవసాయం లో మెలుకవలు నేర్పించారని, అందుకే వీరు పాండవులను కొలవడమే గాక, మొదటగా పండించిన పంటను కొత్తల పేరుతో వారికి నైవేద్యంగా సమర్పిస్తారని తెలుస్తున్నది.

భారతంలోని కర్ణునికి ఎంతకీ పెళ్లి కాకపోవడంతో నారదుని ఆశ్రయిస్తాడు. నీ పెళ్లి చేయగల సమర్ధుడు ధర్మరాజే అని నారదుడు సలహా ఇస్తాడు. ఆ మాట ప్రకారం కర్ణుడు ధర్మరాజు ని కలిసి తన పెళ్లి చేయాల్సిందిగా కోరుతాడు. శత్రువు అయినప్పటికీ సహాయం కోరాడని భావించి, ధర్మరాజు అనేక రాజ్యాలు తిరిగి చివరకు మగధ రాజ్యంలోని నందిగాముని కూతురితో పెళ్లి చేయాలని పూనుకుంటాడు. అయితే తన తండ్రిని పాండురాజు చంపాడనే విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకున్న నందిగాముడు ధర్మరాజు ను బంధించి చంప పోతాడు. అయితే అతన్ని ఎన్ని రకాలుగా హింసించినా అతని చనిపోక పోయేసరికి బ్రాహ్మణ వేషంలో వచ్చిన శ్రీ కృష్ణుడిని సలహా కోరుతాడు. ధర్మరాజును రక్షించడం కోసమే వచ్చిన శ్రీకృష్ణుడు ఐదు రోజులు సత్కరించి ఆరవ రోజున పడమర వైపు ఉన్న వటవృక్షానికి ఉరి తీస్తే చనిపోతాడని మాయమాటలు చెప్పాడు.

ఇంతలో నందిగామునిపై యుద్ధానికి రండని కబురు పంపిస్తాడు. ఆ రకంగా పాండవులు మగధ రాజ్యం పైకి దండెత్తి యుద్ధం చేస్తుండగా, రుక్మిణీదేవి తన అన్నను రక్షించుకోవాలన్న తపనతో మారు వేషం ధరించి యుద్ధానికి బయలుదేరుతుంది. పాండవులు ఒకవైపు రుక్మిణి మరొక వైపు యుద్ధం చేస్తున్న సమయంలో అర్జునుడు మారు వేషంలో ఉన్న రుక్మిణిని చూసి నందిగాముని తమ్ముడు అనుకొని బాణం ప్రయోగించగా ఆమె తల తెగి అడవిలో మద్ది చెట్టు సమీపంలోని పుట్ట దగ్గర పడుతుంది. యుద్ధంలో నందిగాముని జయించి తిరిగివచ్చిన పాండవులకు, కృష్ణునికి రుక్మిణి కనిపించలేదు. యుద్ధరంగంలో వెతకగా ఆమె మొండెం మాత్రమే కనిపిస్తుంది. కృష్ణుడు బాధపడి సైనికులను పిలిచి ఆడగుర్రం తల నరికి తీసుకురమ్మంటాడు. ఆ రకంగా సైనికులు తీసుకురాగా, ఆమె మొండానికి గుర్రం తలను పెట్టి సంజీవని మంత్రం చదవడానికి పూనుకొంటాడు.

అయితే అడవిలో నాయకపోడు వారంతా కర్ర గోల, దుస్స బుట్ట పట్టుకొని కందమూలాలు పండ్లకోసం తిరుగుతుండగా వారికి మద్ది చెట్టు సమీపంలో రుక్మిణి తల కనిపిస్తుంది. ఆమె వారికి విషయం చెప్పి నా తలను శ్రీ కృష్ణునికి అప్పగించమని కోరుతుంది. ఇక్కడ కృష్ణుడు రుక్మిణి మొండానికి తలను పెట్టి, సంజీవని మంత్రం ప్రయోగిస్తుండగా నాయకపోడు వారు రుక్మిణి తలను తీసుకువస్తారు. అందుకు సంతోషించిన కృష్ణుడు గుర్రం తలను పక్కనపెట్టి, రుక్మిణి తలను పెట్టి సంజీవని మంత్రం చదవగా ఆమెతో పాటుగా గుర్రం తలకు కూడా ప్రాణం వస్తుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి ప్రాణం కాపాడిన నాయకపోడు వారికి ప్రాణం ఉన్న గుర్రం తలను ఇచ్చి మీ ఇంటి ఇలవేల్పు గా పూజిస్తే మీకు లక్ష్మి చేకూరడమేకాక, మీకు రక్షణగా ఉంటుందని దీవిస్తాడు. అప్పటినుండి నాయకపోడు వారు గుర్రం తలను లక్ష్మీదేవర గా పూజిస్తూ వస్తున్నారు. ఈ కథలో రుక్మిణియే లక్ష్మీదేవర గా విశ్వసించటం కనిపిస్తుంది.

కొర్రాజులు నాయకపోడు వారిని ఆశ్రయించి పటం ద్వారా పాండవుల కథలతో పాటు పద్మనాయకుల వృత్తాంతాన్ని చెప్తారు. ఈ కొర్రా జులనే తోటి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీరు చెప్పే నాయకపోడు వారి పుట్టుక కథలో శ్రీమహావిష్ణువు రాక్షస సంహారం చేయడానికి దేవకీ వసుదేవుల గర్భంలో జన్మించి కృష్ణావతారం దాల్చినప్పుడు లక్ష్మీదేవి శాంభవుని పట్నంలో వెండిగుడిలో జన్మిస్తుంది. ఆమె ఒక రోజున అడవిలో నడుస్తుండగా ఆమె శరీరంపై వచ్చిన చెమట కొలనులోని పద్మంపై పడగా ఐదుగురు పుత్రులు జన్మిస్తారు. ఆ రకంగా పద్మం నుండి జన్మించిన వారు కాబట్టి పద్మనాయకులు అయ్యారని కనిపిస్తుంది.

లక్ష్మీదేవర నాయకుడు వారికి ఇలవేల్పు ఎట్లా అయ్యాడనడానికి కారణంగా మౌఖికంగా ప్రచారంలో ఉన్న కథను ములుగు జిల్లా పస్రా గ్రామానికి చెందిన దబ్బ సుధాకర్ నాయకపోడు చెప్పారు. భారతంలోని కర్ణునికి ఎంతకీ పెళ్లి కాకపోవడంతో నారదుని ఆశ్రయిస్తాడు. నీ పెళ్లి చేయగల సమర్ధుడు ధర్మరాజే అని నారదుడు సలహా ఇస్తాడు. ఆ మాట ప్రకారం కర్ణుడు ధర్మరాజు ని కలిసి తన పెళ్లి చేయాల్సిందిగా కోరుతాడు. శత్రువు అయినప్పటికీ సహాయం కోరాడని భా వించి, ధర్మరాజు అనేక రాజ్యాలు తిరిగి చివరకు మగధ రాజ్యంలోని నందిగాముని కూతురితో పెళ్లి చేయాలని పూనుకుంటాడు. అయితే తన తండ్రిని పాండురాజు చంపాడనే విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకున్న నందిగాముడు ధర్మరాజు ను బంధించి చంప పోతాడు. అయితే అతన్ని ఎన్ని రకాలుగా హింసించినా అతని చనిపోక పోయేసరికి బ్రాహ్మణ వేషంలో వచ్చిన శ్రీ కృష్ణుడిని సలహా కోరుతాడు.

ధర్మరాజును రక్షించడం కోసమే వచ్చిన శ్రీకృష్ణుడు ఐదు రోజులు సత్కరించి ఆరవ రోజున పడమర వైపు ఉన్న వటవృక్షానికి ఉరి తీస్తే చనిపోతాడని మాయమాటలు చెప్పాడు. ఇంతలో నందిగామునిపై యుద్ధానికి రండని కబురు పంపిస్తాడు. ఆ రకంగా పాండవులు మగధ రాజ్యం పైకి దండెత్తి యుద్ధం చేస్తుండగా, రుక్మిణీదేవి తన అన్నను రక్షించుకోవాలన్న తపనతో మారు వేషం ధరించి యుద్ధానికి బయలుదేరుతుంది. పాండవులు ఒకవైపు రుక్మిణి మరొక వైపు యుద్ధం చేస్తున్న సమయంలో అర్జునుడు మారు వేషంలో ఉన్న రుక్మిణిని చూసి నందిగాముని తమ్ముడు అనుకొని బాణం ప్రయోగించగా ఆమె తల తెగి అడవిలో మద్ది చెట్టు సమీపంలోని పుట్ట దగ్గర పడుతుంది. యుద్ధంలో నందిగాముని జయించి తిరిగివచ్చిన పాండవులకు, కృష్ణునికి రుక్మిణి కనిపించలేదు. యుద్ధరంగంలో వెతకగా ఆమె మొండెం మాత్రమే కనిపిస్తుంది. కృష్ణుడు బాధపడి సైనికులను పిలిచి ఆడగుర్రం తల నరికి తీసుకురమ్మంటాడు.

ఆ రకంగా సైనికులు తీసుకురాగా, ఆమె మొండానికి గుర్రం తలను పెట్టి సంజీవని మంత్రం చదవడానికి పూనుకొంటాడు. అయితే అడవిలో నాయకపోడు వారంతా కర్ర గోల, దుస్స బుట్ట పట్టుకొని కందమూలాలు పండ్లకోసం తిరుగుతుండగా వారికి మద్ది చెట్టు సమీపంలో రుక్మిణి తల కనిపిస్తుంది. ఆమె వారికి విషయం చెప్పి నా తలను శ్రీ కృష్ణునికి అప్పగించమని కోరుతుంది. ఇక్కడ కృష్ణుడు రుక్మిణి మొండానికి తలను పెట్టి, సంజీవని మంత్రం ప్రయోగిస్తుండగా నాయకపోడు వారు రుక్మిణి తలను తీసుకువస్తారు. అందుకు సంతోషించిన కృష్ణుడు గుర్రం తలను పక్కనపెట్టి, రుక్మిణి తలను పెట్టి సంజీవని మంత్రం చదవగా ఆమెతో పాటుగా గుర్రం తలకు కూడా ప్రాణం వస్తుంది. శ్రీకృష్ణుడు రుక్మిణి ప్రాణం కాపాడిన నాయకపోడు వారికి ప్రాణం ఉన్న గుర్రం తలను ఇచ్చి మీ ఇంటి ఇలవేల్పు గా పూజిస్తే మీకు లక్ష్మి చేకూరడమేకాక, మీకు రక్షణగా ఉంటుందని దీవిస్తాడు. అప్పటినుండి నాయకపోడు వారు గుర్రం తలను లక్ష్మీదేవర గా పూజిస్తూ వస్తున్నారు. ఈ కథలో రుక్మిణియే లక్ష్మీదేవర గా విశ్వసించటం కనిపిస్తుంది.

లక్ష్మీదేవర గుడిని గూడెం మధ్యలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉమ్మడి స్థలంలో నిర్మించు కొంటారు లేదా వీరిలో ఎవరైనా గుడికి స్థలమిస్తే అందులోనే తూర్పు ముఖంగా ఉండేటట్టు నిర్మించుకుంటారు. ఇందులో లక్ష్మీదేవర ప్రతిమతోపాటుగా పోతురాజు, కృష్ణ స్వామి,భీముడు, అర్జునుడు ,నకుల సహదేవులు, ధర్మరాజు ,గుర్సింగాబోజుడు, సింగబోజుడు,గుర్రంపోతు, పంది రాజు, తుపాకులు విల్లంబులు ఇవన్నీ ఒక వెదురు బుట్టలో ఉంచి గుడిలో బడ్డీ మీద నిలుపుతారు. ప్రతిమలన్నీ మాస్కులరూపంలో ఉంటాయి. గుర్రం తల ఆకారంలో ఉండే లక్ష్మీదేవరను ఒక పౌజు కు అలంకరిస్తారు. పౌజు అంటే వెదురు కర్రలతో గంప మాదిరిగా తయారుచేయబడినది. దీనిని రకరకాల చీరలతో అలంకరిస్తారు. పూజారి ఎత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ లక్ష్మీదేవర ప్రతిరూపాలు గుర్రం తల ఆకారంలో ఉంటాయి.

కొన్ని ప్రాంతాల్లో ఒకే పౌజుకు రెండు గుర్రం తలల రూపంలో లక్ష్మీదేవర ప్రతిరూపాలు అలంకరించబడి ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో పౌజు లేకుండానే కేవలం గుర్రం తలను మాత్రమే పూజారి ఎత్తుకోవడం కనిపిస్తుంది. ఈ రకంగా విభిన్నంగా ఉన్నప్పటికీ ఆయా ప్రతిమలకు ప్రాణం ఉంటుందని నాయకపోడు వారు విశ్వసిస్తారు. అందుకే జాతర సందర్భంలో ఎత్తుకున్నప్పుడు ఉగ్రం వస్తుందని , ఉగ్రం అంటే దేవుడు ఆవహించడం అని చెప్తారు. ఈ ప్రతిమలను నకాశి కళాకారులతో పొనికి కర్రతో తయారు చేయించుకుని రంగులు వేయించుకుంటారు. తర్వాత పూజారితో బొమ్మలకు “ప్రాణ ప్రతిష్ట” చేయించుకొని పవిత్రంగా పూజించుకుంటారు.

లక్ష్మీదేవరపండుగ:
ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత గూడెంలోని పూజారులు నిర్ణయించిన ముహూర్తానికి మూడు రోజులు పండుగ చేస్తారు. ఈ దేవర ను కొలిచే పూజారులు సుమారుగా 21 లేదా 11 మంది వరకు నిష్టగా ఉండి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. పండుగలో భాగంగా మొదటిరోజు గూడెం వారంతా కలిసి ఇంట్లో శుద్ధి చేసుకుని, గుడికి చేరుకుంటారు. గుడిలోని లక్ష్మీదేవర ప్రతిమతో పాటుగా మిగతా ప్రతిమలను శుద్ధి చేయడానికి గంగ స్నానానికి డప్పు చప్పుళ్ళతో వెళ్తారు. గుడి దగ్గర ఎటువంటి జంతు బలులు నిర్వహించరు. గంగ దగ్గర ఆచారం ప్రకారం పూజారి ఏడు చలిమెలు తీసి వాటికి బొట్లు పెట్టి పవిత్రతను ఆపాదించి, ఆ చలిమె నీటిలో ఆరె,గారె,మారె,నిమ్మ మొదలైన ఆకులు వేసి ఆ నీటితో, పాలతో ప్రతిమలను శుద్ధి చేస్తాడు.

ఆ తర్వాత దేవరను, మిగతా ప్రతిమలను తీసుకొని గూడానికి డప్పు చప్పుళ్లతో బయలుదేరగా దారిలో భక్తులు దేవర కాళ్లు కడిగి నీళ్లు ఆరగింపు చేస్తారు. ఆ తర్వాత గుడిలో ప్రతిష్టించి నియమం ప్రకారం మొక్కు బడులు చెల్లించుకుంటారు. రెండవ రోజు గుడిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, ఈ దేవర గూడెం లోని నాయకపోడు వారికే కాకుండా మిగతా కులాలకు కూడా ఇష్టదైవం కావడంతో ఊరేగిస్తారు. లక్ష్మీదేవరను ఎత్తుకునే పూజారి కాళ్ళకు గజ్జలు, ఎరుపు రంగు తలపాగా ధరించి మొదట దేవర ను ఎత్తుకుంటాడు. ఆ తర్వాత మిగతా పూజారులు ప్రతిమలను ఎత్తుకుంటారు. డప్పు చప్పుళ్లు మొదలవ్వగానే లక్ష్మీదేవరను ఎత్తుకున్న పూజారికి ఉగ్రం రాగా ఊరేగింపుగా బయలుదేరుతారు.

భక్తులు దేవరను ఎదుర్కొని పొర్లు దండాలు పెట్టడం , నీళ్లు ఆరగింపు చేయడం, స్త్రీలు సంతానం కోసం వర పట్టడం, దేవర ఎత్తుకున్న పూజారి నాలుక మీద విభూది వేసిన లేదా వారి మీది నుండి దేవర దాటిన రోగాలు తగ్గుతాయని విశ్వసించటం, అలాగే పోతురాజు ప్రతిమను ఎత్తుకున్న పూజారి తన దగ్గర ఉండే చండ్రకోలతో మానసిక రుగ్మతలన్న భక్తులను కొట్టడం, చేనుకు తెగులు పట్టినా, ఆరోగ్యం బాగా లేకున్నా, పెళ్లిళ్లు సరైన సమయంలో కాకపోయినా ఈ రకంగా ప్రతి సమస్యకు పరిష్కారం లక్ష్మీదేవర చూపుతుందని ప్రగాఢంగా విశ్వసించి దేవరకు మొక్కుబడి ఉన్నవారు చీరలు, కొబ్బరికాయలు సమర్పించుకుంటారు. ఇదే రోజు రాత్రి గుడి దగ్గర పూర్వం ప్రత్యేకంగా నాయకపోడు వారు నృత్యం చేసేవారు. ఇందులో భాగంగా తప్పెటగుళ్ల చప్పుళ్ళు, పిల్లనగ్రోవి పాట, లక్ష్మీదేవర నృత్యం ,నెమలి ఆట ,డేగ ఆట, గుర్రపు పోతు ఆట ,ఉడుము ఆట ఈ రకంగా అటవిక జీవనం గడిపే స్వచ్ఛమైన నాయకపోడు వారు తాము నిత్యం చూసే జంతువుల ఆటలని పండుగ సందర్భంలో ఆడుకుంటూ తమ సాంస్కృతిక పరంపరను కొనసాగించే వారు ప్రస్తుతం ఈ ఆటలు కళారూపాలు అంతరించే దశలో ఉన్నాయి. ప్రస్తుతం గుడి దగ్గర మామూలుగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు.

పండుగలో భాగంగా మూడవరోజు ప్రతి ఇంటి నుండి ఒక బోనం చొప్పున నిష్టగా వండుకొని, గుడి దగ్గరకు ఊరేగింపుగా వచ్చి దేవరకు సమర్పించుకుంటారు.ఈరకంగా గూడెంలో లక్ష్మీ దేవర పండుగను నాయకపోడు వారు మూడు పగలు రెండు రాత్రులు సామూహికంగా ఘనంగా జరుపుకుంటారు. లక్ష్మీదేవర ఈ మధ్యకాలంలో అనుష్టాన కళారూపంగా కూడా పరిణామక్రమం చెంది ఆధునిక పరిశోధకులకు పరిచయమవుతున్నది. నాయకపోడువారు మాత్రం శ్రీకృష్ణుడు ఇలవేల్పుగా ప్రసాదించిన నాటినుండి నేటికీ పూజిస్తూ, తమ సంస్కృతి మూలాలను అనుసరిస్తూ ఆధునిక కాలంలో కూడా తమ సంస్కృతి వైశిష్ట్యాన్ని తమ మూల సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే నాయకపోడు వారికి చెందిన పిల్లనగ్రోవి పాట, నెమలి ఆట, తప్పెటగుళ్ల చప్పుళ్ళు, డేగ ఆట వంటి కళారూపాలు అవసాన దశలో ఉన్నాయి. ఇటువంటి కళారూపాలను ప్రదర్శించే కళాకారులను గుర్తించి వారికంటూ ఒక గుర్తింపును ప్రాచుర్యాన్ని కల్పిస్తే భవిష్యత్ తరాలకు అందించినట్లవుతుంది. ఆయా కళాకారులకు ఐటీడీఏ వంటి సంస్థలు ప్రత్యేక శిక్షణ కల్పించి కళారూపాలను ఆదరించేలా చేయాలని నాయకపోడు వారు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

Story about Nayakapodu tribes Lakshmi Devara

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొర్రాజుల పటం కథ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: