కొమురవెల్లిలో కారు బోల్తా: ఇద్దరి మృతి

Young Man Died With Car Roll Over at Hyderabad

సిద్ధిపేట: కొమురవెల్లి దేవాలయం స్వాగత తోరణం దగ్గర సోమవారం కారు బోల్తాపడింది. మహింద్రా జైలో కారు అదుపుతప్పి బోల్తాపడడంతో ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.