కొనసాగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మె

 strike of panchayat workers

కడ్తాల్:  మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని పలు పార్టీల నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 14వ రోజుకు చేరుకుంది. డిసిసి అధికార ప్రతినిధి గూడురు శ్రీనివాస్‌రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు బాచిరెడ్డి మోహన్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్‌రావు, ఎఐటియూసి జిల్లా కార్యదర్శి పానుగంటి పర్వతాలు, తదితరులు కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని విమర్శించారు. పంచాయతీ కార్మికులు, సిబ్బంది డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని కొరారు. పంచాయతీ కార్మికులు నోటికి నల్లని గుడ్డలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్, వెంకటరమణ, చెన్నయ్య, పోషయ్య, చెన్నమ్మ, మల్లమ్మ,   తదితరులు పాల్గొన్నారు.

Comments

comments