కొత్త సిజెఐగా గొగొయ్

ఢిల్లీ : భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ)గా జస్టిస్ రంజన్ గొగొయ్ నియామకం కానున్నారు. కొత్త సిజెఐగా జస్టిస్ గొగొయ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత సిజెఐ జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్రానికి మంగళవారం లేఖ రాశారు. జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబరు2న రిటైర్ కానున్నారు. అక్టోబర్ 3న జస్టిస్ గొగొయ్ సిజెఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో తన తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తన వారసుడిగా సిజెఐ సిఫార్సు చేస్తారు. ఈ క్రమంలో […]

ఢిల్లీ : భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ)గా జస్టిస్ రంజన్ గొగొయ్ నియామకం కానున్నారు. కొత్త సిజెఐగా జస్టిస్ గొగొయ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత సిజెఐ జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్రానికి మంగళవారం లేఖ రాశారు. జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబరు2న రిటైర్ కానున్నారు. అక్టోబర్ 3న జస్టిస్ గొగొయ్ సిజెఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో తన తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తన వారసుడిగా సిజెఐ సిఫార్సు చేస్తారు. ఈ క్రమంలో తదుపరి సిజెఐ పేరును సిఫార్సు చేయాలని ఇటీవల న్యాయ మంత్రిత్వ శాఖ జస్టిస్ మిశ్రాకు లేఖ రాసింది. దీంతో జస్టిస్ మిశ్రా తదుపరి సిజెఐగా జస్టిస్ గొగొయ్ పేరును ప్రతిపాదిస్తూ న్యాయశాఖకు ఈరోజు లేఖ రాశారు. దీంతో జస్టిస్ గొగొయ్ నియామకం ఇక లాంఛనప్రాయమైంది. జస్టిస్ గొగొయ్ వచ్చే ఏడాది నవంబరు 17వరకు సిజెఐగా కొనసాగుతారు. గొగొయ్ 1954లో అసోంలో జన్మించారు. 1978లో బార్‌లో చేరారు. 2001ఫిబ్రవరి 28న గువహాటి హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబరులో పంజాబ్, హరియాణా కోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. 2011 ఫిబ్రవరిలో అదే హైకోర్టులో చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా 2012 ఏప్రిల్‌లో ప్రమోషన్ పొందారు.

Justice Ranjan Gogoi Select as New CJI of India

Comments

comments

Related Stories: