కొత్త లుక్ కోసం…

Sai-Dharm-Tej

మెగా హీరోల క్రమశిక్షణ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాడీలాంగ్వేజ్‌ను వారు సరిగ్గా మెయింటేన్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి హార్డ్‌వర్క్, క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న తర్వాతే రంగంలోకి దిగుతారు. అందుకే ఎన్ని ప్లాపులొచ్చినా కెరీర్‌పరంగా నిలబడతారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఫ్లాపుల్లో నటించాడు సాయిధరమ్‌తేజ్. ఇటీవల వచ్చిన ‘తేజ్… ఐ లవ్ యు’ వంటి ఫ్లాప్ సినిమాతో పూర్తిగా నిరాశచెందాడు. అందుకే ఇప్పుడు ఎంతో జాగ్రత్త పడుతున్నాడట. ఇటీవలే అమెరికా వెళ్లి అక్కడ సుశిక్షితుడైన ఫిజికల్ ట్రైనర్ సహాయంతో లుక్‌పరంగా ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం అతను ప్రయత్నించాడని తెలిసింది. అందుకోసం ఏకంగా శరీరంలో నుంచి అదనపు కొలెస్టరాల్‌ను అంతా కరిగించే ఎక్సర్‌సైజులు చేసి కొంత బరువు తగ్గాడట. మారిన కొత్త రూపంలో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సాయిధరమ్ వారం రోజుల్లో హైదరాబాద్‌కు రాబోతున్నాడు. అతను నటించే తదుపరి సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Comments

comments