కొత్త పంచాయతీలు షురూ

పాతవి 457, కొత్తవి 190, మొత్తం 647 నారాయణ్‌ఖేడ్‌లోనే కొత్తవి 88 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టిన సెషల్ ఆఫీసర్ మన తెలంగాణ/సంగారెడ్డి : పంచాయతీల్లో కొత్త పాలన మొదలైంది. సర్పంచ్, పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో గురువారం నుంచి అధికారుల పాలన మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పంచాయతీల పాలన పగ్గాలు అధికారులు చేపట్టారు. అదే సమయంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలు ప్రారంభమయ్యాయి. పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన ప్రాంతాల్లో కూడా […]

పాతవి 457, కొత్తవి 190, మొత్తం 647
నారాయణ్‌ఖేడ్‌లోనే కొత్తవి 88
ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
బాధ్యతలు చేపట్టిన సెషల్ ఆఫీసర్

మన తెలంగాణ/సంగారెడ్డి : పంచాయతీల్లో కొత్త పాలన మొదలైంది. సర్పంచ్, పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో గురువారం నుంచి అధికారుల పాలన మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పంచాయతీల పాలన పగ్గాలు అధికారులు చేపట్టారు. అదే సమయంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలు ప్రారంభమయ్యాయి. పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన ప్రాంతాల్లో కూడా అట్టాహాసంగా ఈ వేడుకలు జరిగాయి. దీంతో అటు గ్రామాలలో, ఇటు కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. రామాయంపేట మున్సిపాలిటీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అదే విధంగా కొత్త పంచాయతీలను ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించడం ద్వారా పంచాయతీలకు కొత్తకళ వచ్చింది. సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీల్లో గురువారం నుంచి కొత్త శకం మొదలైంది. బుధవారం వరకు ఇవన్నీ సర్పంచ్‌ల పాలనలో కొనసాగాయి. ఎన్నికలు జరిపే పరిస్థితి లేకపోవడంతో అధికారులను ఇంచార్జిలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీల సంఖ్య వందల్లో ఉండటంతో అధికారుల కొరత ఏర్పడింది. ఈ కారణంగా సీనియర్ అసిస్టెంట్ మొదలు కొని జిల్లా అధికారుల వరకు బాధ్యతలు అప్పగించారు. పెద్ద పంచాయతీలకు, ముఖ్యమైన పంచాయతీలకు ఉన్నతాధికారులను నియమించి, చిన్న పంచాయతీలకు చిన్నస్థాయి అధికారులను నియమించారు. ఉదాహరణకు సంగారెడ్డి పక్కనే ఉన్న కంది గ్రామ పంచాయతీకి జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. కాగా  ఫసల్‌వాదికి సంగారెడ్డి తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను, చెర్యాల్‌కు కంది తహసీల్దార్ గోవర్థన్‌ను నియమించారు. ఆ విధంగా పంచాయతీల ప్రాముఖ్యాన్ని బట్టి అయా ప్రాంతాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇతర అభివృద్ధి పనుల ఆధారంగా అధికారుల నియామకం జరిగింది. కొండాపూర్ మండలంలో మల్కాపూర్ పంచాయతీకి కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ ఇందిరను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించగా, పరిశ్రమలు అధికంగా ఉన్న మల్లేపల్లికి ఎంపిడివో స్వప్నను నియామకం చేపట్టారు. ఈ విధంగా మొత్తం 647 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం జరిగింది.

కొత్తగా ఏర్పడ్డ తెల్లాపూర్, అమీన్‌పూర్, ఐడిఎ బొల్లారం, నారాయణ్‌ఖేడ్ మున్సిపాలిటీలను గురువారం ప్రారంభించారు. బుధవారం వరకు ఇవన్నీ గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం ఈ పంచాయతీలకు పదోన్నతి కల్పించి పురపాలక సంఘాలుగా మార్చింది. దీంతో ఈ పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చిన సంగతి ప్రజలందరికీ తెలిసేందుకు గాను అట్టహాసంగా గురువారం ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తద్వారా ప్రభుత్వం పంచాయతీ, కొత్త మున్సిపాలిటీల్లో సరికొత్త పాలనకు తెరలేపింది. ప్రభుత్వం ఇటీవల జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం పంచాయతీల పాలన కొనసాగించాలని ఉన్నతాధికారులు ఈ స్పెషల్ ఆఫీసర్లకు నిర్దేశించారు. ఆ విధంగా పంచాయతీల్లో నూతన శకానికి నాందిపడింది.

Comments

comments

Related Stories: