కొడుకు కెరీర్ కోసం కాళ్ళ మీద పడిపోయారట..?!

Rishi Kapoor fell on Hirani's mother’s feet Ranbir?

ముంబయి: ‘సంజూ’ సినిమాకు ముందు రణబీర్‌ కపూర్ వరుస ప్లాపులతో సతమతమైన సంగతి తెలిసిందే. ఏ సినిమా చేసిన విజయం మాత్రం ఆమడదూరంలోనే ఉండిపోయింది. దాంతో అతడి కెరీర్ ప్రమాదంలో పడిపోయింది. ఇక రణబీర్ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో సంజూతో బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన సత్తాచాటాడు. ఇన్ని సంవత్సరాలుగా రాని పేరు రణబీర్‌కు ‘సంజూ’ మూవీతో వచ్చేసింది. గొప్ప చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ ఘనత దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికే దక్కుతుంది. విమర్శకులు సైతం అంగీకరించేటట్టు తీయగలిగారు హిరాణి. అయితే, తాజాగా రణబీర్‌తో హిరాణి ఈ సినిమా తీయడానికి వెనుక చాలా డ్రామానే నడించిందని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు రణబీర్‌ కెరీర్‌ ప్రమాదంలో పడబోతోందని సీనియర్ నటుడు రిషికపూర్‌ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారట!

కొడుకు కెరీర్‌ని అపజయాల నుంచి విజయాల బాట పట్టించాలంటే ఒక్క హిరాణి వలనే అవుతుందని ఆయన గట్టిగానమ్మారట! దీంతో ఆయన నేరుగా వెళ్లి హిరాణి తల్లి గారి కాళ్ళ మీద పడిపోయారట! ఎలాగైన తన కుమారుడి కెరీర్ ను నిలబెట్టాలని వేడుకున్నారట. ఒక్క మూవీలో అవకాశమిచ్చి తన కొడుకు కెరీర్‌ని హిరాణి నిలబెట్టాలని రిషికపూర్‌ ఆ మాతృమూర్తి కాళ్ళు పట్టుకొని వేడుకున్నారని బాలీవుడ్ వర్గాల బోగట్టా. ఇక ఆయన విన్నపాలకు కరిగిపోయిన హిరాణి తల్లి కొడుకుకి నచ్చచెప్పి ‘సంజూ’ సినిమాలో రణబీర్‌కి అవకాశం ఇప్పించారట! ఇలా సంజూ సినిమాలో రణబీర్ హీరోగా సెలక్ట్ అయ్యారట. కాగా, అవకాశం వరకు అయితే రికమెండేషన్లు పని చేశాయి కానీ, మూవీ విజయానికి నూటికి నూరుపాళ్ళూ రణబీర్ నటనే కారణమంటున్నారు బాలీవుడ్‌ జనాలు. సంజూలో సంజయ్‌దత్‌ పాత్రలో రణబీర్‌ ఒదిగిపోయారని, మరే నటుడు చేయలేడని బాలీవుడ్‌ విమర్శకులు సైతం ముక్తకంఠంతో అంగీకరించారు. రణబీర్‌తో హిరాణి ఈ సినిమా తీయడానికి వెనుక ఇంత డ్రామా జరిగిందనే ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Comments

comments