కొడుకును కడతేర్చిన తండ్రి..!

పెద్దపల్లి: మాట వినడం లేదని కన్న కొడుకును తండ్రి కడతేర్చిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపలిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే ఆదిరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు డిగ్రీ పూర్తి చేసిన చిన్నకుమారుడు విజయ్‌కుమార్ ఉన్నాడు. విజయ్ కూడా తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల తండ్రికొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది కాస్తా […]

పెద్దపల్లి: మాట వినడం లేదని కన్న కొడుకును తండ్రి కడతేర్చిన దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపలిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే ఆదిరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు డిగ్రీ పూర్తి చేసిన చిన్నకుమారుడు విజయ్‌కుమార్ ఉన్నాడు. విజయ్ కూడా తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల తండ్రికొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో కొడుకుపై కోపం పెంచుకున్న తండ్రి ఆరుబయట నిద్రిస్తుండగా పారతో తలపై దాడి చేశాడు. దీంతో విజయ్‌కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం తండ్రి ఆదిరెడ్డి సుల్తానాబాద్ సిఐ కార్యాలయంలో లొంగిపోయాడు.