కొడంగల్ పర్యటనలో టిఆర్ఎస్ మంత్రులు

పరిగి: టిఆర్ ఎస్ మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డిలు శనివారం కొడంగల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. చేవెళ్లలో మంత్రులకు టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం షాబాద్ నుంచి పలు వాహనాల్లో మంత్రుల వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్లారు. మొయినాబాద్, చేవెళ్లలో మంత్రులు టిఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.  ప్రజలకు కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన బహుమతి ప్రాజెక్టులను నిలిపివేసేలా కేసులు వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ […]

పరిగి: టిఆర్ ఎస్ మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డిలు శనివారం కొడంగల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. చేవెళ్లలో మంత్రులకు టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం షాబాద్ నుంచి పలు వాహనాల్లో మంత్రుల వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్లారు. మొయినాబాద్, చేవెళ్లలో మంత్రులు టిఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.  ప్రజలకు కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన బహుమతి ప్రాజెక్టులను నిలిపివేసేలా కేసులు వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేసులు వెనక్కు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. కేసులు వేకెంట్ అయిన 15 రోజుల్లో ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.