కొండా దంపతులపై సుధారాణి ఫైర్!

TRS Leader Gundu Sudharani fires on Konda Surekha

హైదరాబాద్: కొండ దంపతుల తీరుపై టిఆర్‌ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి నిప్పులు చెరిగారు. కొండా మురళీ, సురేఖ దంపతులకు కెసిఆర్ రాజకీయ భిక్ష పెట్టారని ఆమె పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీపై కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ స్థానికురాలు కాదని, ఆమెది తూర్పు నియోజకవర్గం కాదన్నారు. తూర్పు నియోజకవర్గం టికెట్ కొండా కుటుంబానికి కాకుండా ఎవరికి ఇచ్చినా పని చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కెసిఆర్ నాయకత్వంలో పని చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని సుధారాణి పేర్కొన్నారు. కెటిఆర్ కొటరీ చేస్తున్నారని సురేఖ చెప్పడంపై అలాంటిదేమి లేదని, ఇక్కడ ఒక్కటే నాయకత్వమని, అలాంటివి కొండ దంపతులకు అలవాటు అని చెప్పుకొచ్చారు. కొండా సురేఖ పార్టీ వీడడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన 105 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై కొండా సురేఖ మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శనివారం కొండా దంపతుల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానంపై కొండ సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Comments

comments