కొండవాగులో కొట్టుకుపోయి ఐదుగురి దుర్మరణం

 తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు అడవిలోని గుడి వద్ద దుర్ఘటన  

మృతులు కృష్ణా జిల్లావాసులు 

small-River_manatelangana copyమన తెలంగాణ/అశ్వారావుపేట :  తెలం గాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో  ఉన్న  గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద హఠా త్తుగా కొండవాగులో కొట్టుకుపోయి ఆది వారం నాడు ఐదుగురు భక్తులు జల సమాధి అయ్యారు. హఠాత్తుగా పొంగిన కొండవాగు ఉధృతిలో కొందరు  కొట్టుకు పోగా, మరి కొందరిని స్థానికులు రక్షిం చారు. ఈ ఘటనలో  విజయవాడ, సింగ్ నగర్‌కు చెందిన ఆకుల కల్యాణి(35), పటమటలంకకు చెందిన మరిది సరస్వతి(62), గుడివాడ మండలం దొండపాడుకు చెందిన ఏనుగుల మాధవి(35), విజయవాడకు చెందిన  వేముల లోకేష్(13), ఆగిరేపల్లి మండలం నెక్క ల గొల్లగూడెంకు చెందిన ఉప్పలపాటి దీపక్ సాయి(16) మృతి చెందారు.  విజయవాడకు చెందిన వేముల ఉమాదేవి అనే మహిళ ఆచూకీ లభించలేదు. విజయవాడకు చెందిన వేముల  ఉప్పలపాటి రాము అనే వ్యక్తి మొక్కులు తీర్చు కొనేందుకు విజయవాడ, గొల్లగూడెంకు చెంది న తన బంధువులను రెండు ఆల్విన్ వాహనాల్లో  గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చారు.  ఉద యం సుమారు 8:30 గంటల సమయంలో వాగులో నుంచి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో కొండపైన కురిసిన వర్షం కారణంగా  ఆలయంపై నుండి ప్రవహించే కొండవాగు ఒక్కసారే ఉధృత్తంగా వచ్చింది.  దీంతో భక్తు లు భయభ్రాంతులకు గురైయారు.  ఆలయం నుండి బైటకు వచ్చేందుకు పరుగులు పెట్టారు.  అప్పటికే వరద ఉధృతి పెరగటంతో ఆలయం ముందు వున్న 20 మంది భక్తులు వాగులో కొట్టు కుపోయారు.  వాగులో  కొట్టుకుపోతున్న వారిని   స్థానికులు  కొందరిని రక్షించారు.  సుమారు 14 మందికి చిన్న చిన్న గాయాలతో బైటపడ్డారు.  విజయవాడక చెందిన  మల్లవరుపు దుర్గ అనే మహిళ అపస్మారక స్థితిలో వుండటంతో ఆసుపత్రికి తరలించారు.  సంఘటన తెలుసుకున్న పశ్చిమగోదావరి జిల్లా కెఆర్‌పురం ఐటిడిఏ పిఒ సూర్యనారాయణ, జంగారెడ్డిగూడెం డిఎస్‌పి వెంకట్రావు,  సిఐ శ్రీనివాస్‌యాదవ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతు ఆయినవారి కోసం 6 గంటలకుపైగా గాలింపు చర్యలు చేపట్టారు.  వాగులో కొట్టుకుపోతున్న వారిని రక్షించిన గిరిజనులను అభినందించారు.  మృతదేహాలను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు.  ఈ సంఘటనతో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద విషాదచాయలు నిండాయి.