కొండగట్టు ప్రమాదంలో 58కి చేరిన మృతుల సంఖ్య

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 58కి చేరింది. జగిత్యాల, హైదరాబాద్ ఆస్పత్రులో 44 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో  నలుగురు చిన్నారులు,  31 మంది మహిళలు, 23 మంది పురుషులు ఉన్నారు.  జగిత్యాల డిపోకు చెందిన (ఎపి 28 జెడ్ 2319) ఆర్‌టిసి బస్సు కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తుండగా ఘాట్ రోడ్డుపై అదుపు తప్పి సుమారు 12 మీటర్ల లోతులో ఉన్న […]

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 58కి చేరింది. జగిత్యాల, హైదరాబాద్ ఆస్పత్రులో 44 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో  నలుగురు చిన్నారులు,  31 మంది మహిళలు, 23 మంది పురుషులు ఉన్నారు.  జగిత్యాల డిపోకు చెందిన (ఎపి 28 జెడ్ 2319) ఆర్‌టిసి బస్సు కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వస్తుండగా ఘాట్ రోడ్డుపై అదుపు తప్పి సుమారు 12 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడగా 24 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మరో 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, డబ్బుతిమ్మాయిపల్లె గ్రామాలకు చెందిన వారే ఎక్కువ మంది మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది.

Comments

comments

Related Stories: