కొండగట్టులో ఘోర ప్రమాదం.. 46 మంది మృతి

జగిత్యాల: ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో 46 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై మంగళవారం చోటుచేసుకుంది. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సు లో 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శరత్, ఎస్‌పి సింధూ శర్మ వెంటనే […]

జగిత్యాల: ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో 46 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై మంగళవారం చోటుచేసుకుంది. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సు లో 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శరత్, ఎస్‌పి సింధూ శర్మ వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని అక్కడివారిని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మృతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల్లో 25 మంది మహిళలు, 7 గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Comments

comments

Related Stories: