కొంగర కలాన్ వద్ద కొలువుదీరనున్న జనసంద్రం

సెప్టెంబర్ 2న 25 లక్షల మందితో ప్రగతి నివేదన సభ  మంత్రులతో సుదీర్ఘ భేటీలో సిఎం కెసిఆర్ ఆదేశం సభ నభూతో నభవిష్యతి అనిపించాలని సూచన నేటి నుంచే ఏర్పాట్లు ్రప్రారంభం వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు రేపు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ సమావేశం హాజరు కానున్న రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ, శాసన సభాపక్ష నేతలు మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 13వ తేదీన తెలంగాణ భవన్‌లో ప్రకటించిన విధంగానే […]

సెప్టెంబర్ 2న 25 లక్షల మందితో ప్రగతి నివేదన సభ 

మంత్రులతో సుదీర్ఘ భేటీలో సిఎం కెసిఆర్ ఆదేశం
సభ నభూతో నభవిష్యతి అనిపించాలని సూచన
నేటి నుంచే ఏర్పాట్లు ్రప్రారంభం
వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు
రేపు తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీ సమావేశం
హాజరు కానున్న రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ, శాసన సభాపక్ష నేతలు

మన తెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 13వ తేదీన తెలంగాణ భవన్‌లో ప్రకటించిన విధంగానే ‘ప్రగతి నివేదన’ సభ సెప్టెంబర్ 2వ తేదీనే జరగనుంది. ప్రగతిభవన్‌లో బుధవారం సాయంత్రం మంత్రులతో ఆరున్నర గంటలకు పైగా సమావేశం జరిపిన సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్ట తనిచ్చినట్లు తెలిసింది. సుమారు 25 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలను ఆదేశించినట్లు సమాచా రం. ఆరునూరైనా సెప్టెంబరు 2వ తేదీన ప్రగతి నివేదన సభ నభూతో అనే తీరులో జరిగి తీరాల్సిందేనని, గురువారం ఉదయం నుంచే ఏర్పాట్లు ప్రారంభం కావాలని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సభ వాయిదా పడే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ మాత్రం యధావిధిగా అదే రోజున నిర్వహించాలని స్పష్టతనిచ్చారు.

ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినందున ఇబ్బంది ఉండకపోవచ్చని వ్యాఖ్యానిస్తూనే, ఒకవేళ వర్షాలు వచ్చినా ఇబ్బందిలేని తీరులో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు తెలిసింది. మంత్రుల అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి విన్న తర్వాత ఈ నిర్ణ యం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో మంత్రులంతా 2వ తేదీనే ప్రగతి నివేదన సభను జరపడమే అవసరమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రగతి నివేదన సభపై తేదీతో సహా ప్రకటించిన తర్వాత టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని, సభ కోసం ఎదురు చూస్తున్నారని మం త్రులు వివరించారు. సభను వాయిదా వేయకుండా జరపడమే మంచిదని, గతంలో ఏ సభకూ రాని విధంగా జనసమీకరణ చేస్తామని ముఖ్యమంత్రికి మంత్రులంతా హామీనిచ్చినట్లు సమాచారం.

ఈ సభ రాష్ట్రంలోని ప్రతి పక్షాలకు వెన్నులో వణుకు పుట్టేలా విజయవంతం చేస్తామని సిఎంకు హామీ ఇవ్వడంతో పాటు దేశంలోని రాజకీయ పార్టీలు ఆశ్చర్యపోయేలా సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయడంపై భరోసానిచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ శివారు లోని కొంగర కలాన్ ప్రాంతంలో సుమారు 1600 ఎకరాల విశాల స్థలం అందుబాటులో ఉండడంతో ఇక్కడే జరపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామ ని సిఎం కెసిఆర్ జనసంద్రం స్పష్టం చేశారు. ఈ సభ ద్వారా నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం సాధించిన విజయాలను, చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచి త విద్యుత్, పేదలకు అందిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళు, మిషన్ కాకతీయ, మిషన్ భగరీథ వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, వీటిని ‘ప్రగతి నివేదన’లో ప్రస్తావించాలని సిఎంకు సూచించినట్లు తెలిసింది.

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హా మీలను కూడా ప్రభుత్వం నెరవేర్చిన అంశాలను వాటిని కూడా వివరిస్తా రు. కొంగరకొలాన్‌లో సుమారు 1600 ఎకరాల స్థలం ఉన్నందున భారీ స్థాయిలో సభా వేదిక, వివిధ జిల్లాల నుంచి వచ్చేవారి వాహనాల కోసం భారీ స్థాయిలో పార్కింగ్ సౌకర్యం, బారికేడ్‌ల ఏర్పాటు& ఇలా అనేక అం శాల్లో పార్టీ నేతలు దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా సిఎం సూచించినట్లు తెలిసింది. ఇప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభిస్తేనే అనుకున్నట్లుగా భారీ స్థాయిలో సభను నిర్వహించగలని వివరించిన సిఎం వెంటనే రంగంలోకి దూకాలని, వివిధ కమిటీలను ఏర్పాటుచేసుకుని పని విభజన చేయాలని, సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ప్రారంభమయ్యేలా నిర్దిష్ట కార్యక్రమ ప్రణాళికను రూపొందించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.

రేపు టిఆర్‌ఎస్ పార్టీ సమావేశం : పలు ముఖ్యమైన రాజకీయ అంశాలపై చర్చించే నిమిత్తం టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం ౩ గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనుంది. పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం నాయకులతో సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17వ తేదీనే ఈ సమావేశాన్ని నిర్వహించేలా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కెసిఆర్ వాయిదా వేశారు. మరోవైపు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితి, వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్న ‘ప్రగతి నివేదన’ భారీ బహిరంగసభ, ఎన్నికలకు సమాయత్తం కావడం తదితర పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులతో కెసిఆర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఎన్నికలపై చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న కెసిఆర్ రాజకీయ అంశాలపై విస్తృత స్థాయిలో అభిప్రాయాలను సేకరించాలని భావిం చి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంట రీ పక్షం, శాసనసభాపక్షం నాయకులందరితో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో టిఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి, ప్రభుత్వ చేపట్టిన పలు అభివృది పథకాలు, వాటి ద్వారా లబ్ధి పొందిన ప్రజల మనోభావాలు, ఈ నాలుగేళ్ళలో క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాల్లో వచ్చిన మార్పులు తదితరాలపై విస్తృతంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలనే అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుందామని కెసిఆర్ మంత్రులకు వివరించినట్లు తెలిసింది. తెలంగాణ భవనలో జరిగే సమావేశంలో కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రాష్ట్రమంతటా వినిపిస్తున్న ‘ముందస్తు’పై పార్టీ నేతలకు ఎలాంటి స్పష్టత ఇస్తారు? తదితర అంశాలపై ఉత్కంఠ నెలకొంది.

Related Stories: