కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

 constables of the court are trying best to solve the cases

జిల్లా ఎస్‌పి అంబర్ కిషోర్ ఝా

మన తెలంగాణ/ కొత్తగూడెం కలెక్టరేట్: కోర్టు కానిస్టేబుల్లు కేసుల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని జిల్లా ఎస్‌పి అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఇటివల జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలోని కోర్టు సిబ్బంది, రైటర్లతో ఆయా డిఎస్‌పిలు, సిఐలు సమావేశం నిర్వహించి వివిధ కేసుల స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. బాధితులకు న్యాయం జరిగే దిశగా ఆయా కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి కోర్టు సిబ్బంది, అధికారుల నుండి సలహాలు సూచనలు సేకరించారు. అందులో భాగంగా శనివారం జిల్లా ఎస్‌పి, కొత్తగూడెం డిఎస్‌పి అలీ స్థానిక 2 వ టౌన్ పోలీస్ స్టేషన్లోని సమావేశమై కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారానికి మార్గ నిర్దేశాలు చేశారు.

Comments

comments