కేరళ వర్షాలపై మోడీ సమీక్ష

తిరువనంతపురం : పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అస్తవస్తమైంది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 324 మందికి పైగా చనిపోయారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు దెబ్బతిని ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. దీంతో కేరళలోని 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో కేరళలోని వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్రమోడీ కేరళకు వచ్చారు. ఆయన ఏరియల్ సర్వే నిర్వహించాలనుకున్నప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన […]

తిరువనంతపురం : పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అస్తవస్తమైంది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 324 మందికి పైగా చనిపోయారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు దెబ్బతిని ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. దీంతో కేరళలోని 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో కేరళలోని వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్రమోడీ కేరళకు వచ్చారు. ఆయన ఏరియల్ సర్వే నిర్వహించాలనుకున్నప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన వర్షాలపై సమీక్ష చేశారు. పునరావాస కేంద్రాల్లో 3 లక్షల మంది ఆశ్రయం పొందినట్టు మోడీకి సిఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ సమీక్షలో అధికారులతో పాటు రాష్ట్ర గవర్నర్ సదాశివం, కేంద్రమంత్రి కెజె ఆల్పోన్స్, ఎన్‌డిఆర్‌ఎఫ్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PM Narendra Modi’s Review on Kerala Rains

Comments

comments

Related Stories: