కేరళ వరద బాధితుల సహాయనిధి శిబిరం

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కేరళ వరద బాధితుల సహాయనిధి శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. కేరళ వరద బాధితుల కోసం తన నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. కేరళ ప్రజలకు అండగా ఉండాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు తోచిన రీతిలో కేరళ వరద బాధితులకు సహాయం అందించాలని ఆయన కోరారు. భారీ వర్షాల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 400 మందికి పైగా చనిపోయారు. వేల సంఖ్యలో […]

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కేరళ వరద బాధితుల సహాయనిధి శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. కేరళ వరద బాధితుల కోసం తన నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. కేరళ ప్రజలకు అండగా ఉండాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు తోచిన రీతిలో కేరళ వరద బాధితులకు సహాయం అందించాలని ఆయన కోరారు. భారీ వర్షాల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 400 మందికి పైగా చనిపోయారు. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకొస్తున్నారు.

Relief Fund Camp for Kerala Flood Victims

Related Stories: