కేరళ వరద బాధితులకు గోవా సాయం

పనాజీ : భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో సుమారు 400 మంది చనిపోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు కేరళకు భూరీ విరాళాలు ఇచ్చాయి. గోవా తరపున కేరళ వరదబాధితులకు ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు గోవా సిఎం మనోహర్ పారికర్ తెలిపారు. కేరళ ప్రజలను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత యావత్ […]

పనాజీ : భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో సుమారు 400 మంది చనిపోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు కేరళకు భూరీ విరాళాలు ఇచ్చాయి. గోవా తరపున కేరళ వరదబాధితులకు ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు గోవా సిఎం మనోహర్ పారికర్ తెలిపారు. కేరళ ప్రజలను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత యావత్ భారత్ ప్రజలపై ఉందని ఆయన పేర్కొన్నారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు తమకు తోచిన రీతిలో సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Goa Announces Rs.5 Crore to Help Kerala Flood Victims

Comments

comments

Related Stories: