కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

ఢిల్లీ : కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 400 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 3.14 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కేరళ విపత్తుపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని ఆయన ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాహుల్ శనివారం మోడీకి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా కేరళ ప్రజలకు ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ […]

ఢిల్లీ : కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 400 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 3.14 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కేరళ విపత్తుపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని ఆయన ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాహుల్ శనివారం మోడీకి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా కేరళ ప్రజలకు ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు శనివారం ఢిల్లీలో సమావేశమై విరాళాలపై నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తమ నెల వేతనాన్ని కేరళకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తమతమ నెల జీతాన్ని కేరళకు విరాళంగా ఇవ్వనున్నారు.

కేరళ విపత్తుపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటినో గుటెర్రెస్ విచారం వ్యక్తం చేశారు. భారత్‌లో తమ బృందం కేరళ పరిస్థితిని పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేరళకు భారత్‌లోని తామ బృందం సహాయమందిస్తుందని ఆయన తెలిపారు.

Kerala Floods Should be Declared a National Disaster

Comments

comments

Related Stories: