కేరళ ప్రజలకు సాయం చేయండి : ట్రూడో

Help to Kerala People : Trudeauకెనడా : భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ ప్రజలను ఆదుకోవాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రపంచ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేరళో వరదల కారణంగా మృతి చెందిన వారికి ఆయన సంతాపం ప్రకటించారు. ప్రకృతి అందాలకు నెలవైన కేరళ భారీ వర్షాలతో అల్లాడిపోవడం తనను కలిచి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన కోరారు. వందేళ్ల తరువాత కేరళలో ఇంతటి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 400 మందికి పైగా చనిపోయారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రపంచ దేశాలు కేరళకు సాయమందించేందుకు ముందుకు వస్తున్నాయి.

Help to Kerala People : Trudeau

Comments

comments