కేరళను ఆదుకోవాలి : కవిత

ఢిల్లీ : భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకోవాలని నిజామాబాద్ టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. కేరళలో భారీ వర్షాలు రావడంతో కొండచరియలు విరిగిపడి 26 మంది చనిపోయారు. రాష్ట్రంలో నదులు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. దీనిపై కవిత ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ ఏడాది కేరళపై ప్రకృతి జాలి చూపలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కేరళకు అన్ని విధాలుగా అండగా ఉండాలని, వర్షం బాధితుల కోసం పునరావాస […]

ఢిల్లీ : భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకోవాలని నిజామాబాద్ టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. కేరళలో భారీ వర్షాలు రావడంతో కొండచరియలు విరిగిపడి 26 మంది చనిపోయారు. రాష్ట్రంలో నదులు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. దీనిపై కవిత ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ ఏడాది కేరళపై ప్రకృతి జాలి చూపలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కేరళకు అన్ని విధాలుగా అండగా ఉండాలని, వర్షం బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు.

MP Kavitha Comments on Kerala Rains

Comments

comments

Related Stories: