కేరళకు సాయంపై తుది నిర్ణయం తీసుకోలేదు

యుఎఇ రాయబారి స్పష్టీకరణ న్యూఢిల్లీ: జల విలయంతో అతలాకుతలమైన కేరళకు సాయంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) రూ.700 కోట్లు ఇస్తానని అనడం, అందుకు కేంద్రం నో చెప్పడంపై దుమారం చెలరేగడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. కేరళకు ఇచ్చే సహాయ నిధిపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని భారత్‌లో యుఎఇ రాయబారి అహ్మద్ అల్బన్నా స్పష్టం చేశారు. సహాయ నిధి అవసరమైన వారికి అందేలా చూడడం కోసం కమిటీని […]

యుఎఇ రాయబారి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: జల విలయంతో అతలాకుతలమైన కేరళకు సాయంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) రూ.700 కోట్లు ఇస్తానని అనడం, అందుకు కేంద్రం నో చెప్పడంపై దుమారం చెలరేగడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. కేరళకు ఇచ్చే సహాయ నిధిపై తాము ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని భారత్‌లో యుఎఇ రాయబారి అహ్మద్ అల్బన్నా స్పష్టం చేశారు. సహాయ నిధి అవసరమైన వారికి అందేలా చూడడం కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన వారికి సహాయం అందేలా చూడడం కోసం ఆ కమిటీ భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని ఆయన చెప్పారు.

కేరళకు సాయంగా యుఎఇ ఎంత మొత్తం ఇవ్వాలనే దానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కేరళకు సాయం చేస్తామని యుఎఇ గత వారం ప్రకటించింది. కేరళకు సాయం చేసేందుకు తమ దేశం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు యుఎఇ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోమ్ ఈ నెల 18న ఒక ప్రకటన కూడా చేశారు. అనంతరం యుఎఇ వంద మిలియన్ డాలర్లు (రూ.700 కోట్లు) సాయం చేస్తానని చెప్పిట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. అయితే విదేశీ సాయాన్ని అంగీకరించబోమని కేంద్రం స్పష్టం చేయడంతో ఈ అంశం వివాదంగా మారింది.

Comments

comments

Related Stories: