కేరళకు రెహమాన్ విరాళం

చెన్నయ్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కేరళకు భారీ విరాళం అందించారు. తన బృందంతో కలిసి కేరళ వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని అందించినట్టు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. రెహమాన్ తన బృందంతో కలిసి ఆదివారం అమెరికాలో సంగీత విభావరి నిర్వహించారు. తాను చేసిన ఈ చిన్న సాయం కేరళ ప్రజలకు కాసింత ఊరటనిస్తుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. […]

చెన్నయ్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కేరళకు భారీ విరాళం అందించారు. తన బృందంతో కలిసి కేరళ వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని అందించినట్టు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. రెహమాన్ తన బృందంతో కలిసి ఆదివారం అమెరికాలో సంగీత విభావరి నిర్వహించారు. తాను చేసిన ఈ చిన్న సాయం కేరళ ప్రజలకు కాసింత ఊరటనిస్తుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. కేరళ వరద బాధితులను ఉద్దేశించి ఇటీవల ఆయన ‘ కేరళ … కేరళ …డోన్ట్ వర్రీ కేరళ ’ అనే పాటను పాడారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. అమెరికా టూర్‌ను పూర్తి చేసుకుని ఈనెలలో భారత్‌కు ఆయన తిరిగి రానున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘ నవాబ్ ’ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో రెహమాన్ ప్రదర్శన ఇవ్వనున్నారు.

Music Director Rahman’s Donation to Kerala

Comments

comments

Related Stories: