కేరళకు అర్జున్ రెడ్డి భూరీ విరాళం

హైదరాబాద్: గత కొన్నిరోజులుగా కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేరళలో వరద బీభత్సానికి టాలీవుడ్ నటులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ కదిలి వచ్చి విరాళాలు ప్రకటిస్తుండగా, తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తనవంతు సాయం ప్రకటించాడు. తనకెంతో ఇష్టమైన కేరళ ఇలా వరదల బారినపడడం బాధగా ఉందన్న ఆయన రూ.5 లక్షల ఆర్థిక సాయం […]

హైదరాబాద్: గత కొన్నిరోజులుగా కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేరళలో వరద బీభత్సానికి టాలీవుడ్ నటులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ కదిలి వచ్చి విరాళాలు ప్రకటిస్తుండగా, తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా తనవంతు సాయం ప్రకటించాడు. తనకెంతో ఇష్టమైన కేరళ ఇలా వరదల బారినపడడం బాధగా ఉందన్న ఆయన రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి నగదు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అంతేగాక కేరళను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా తన అభిమానులకు పిలుపునిచ్చాడు. తనకు ఇష్టమైన పర్యాటక ప్రదేశాల్లో కేరళ ఒకటని ఈ సందర్భంగా విజయ్ ట్వీట్ చేశాడు. మరోవైపు, తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నటులు కమల్ హాసన్, కార్తీ, సూర్య తదితరులు ఇప్పటికే తమ వంతు సాయాన్ని ప్రకటించిన విషయం విదితమే.

Related Stories: