కేన్సర్‌ నివారిణి గంజాయి!

గంజాయిని వైద్య రంగంలో ఔషధిగా గుర్తించడమే కాక ఇది వ్యాధినిరోధక శక్తిని పటిష్టం చేస్తుందని, కేన్సర్‌ను నిరోధి స్తుందని పరిశోధకులు వెల్లడిం చారు. మానవులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షిండానికి అనేక అధ్యయనాలు చేయవలసి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. గంజాయిలో ‘ఫైటో కెనాబినాయిడ్స్’ అనే రసాయనాలు ఉన్నాయి. ఇవి కేన్సర్ కణాలు రెట్టింపు కాకుండా ట్యూమర్లకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకుంటాయి. అనేక సంవత్సరాలుగా ప్రచారకుల నుంచి వస్తున్న ఒత్తిడుల ఫలితంగా బ్రిటన్ ప్రభుత్వం చట్టబద్ధమైన […]

గంజాయిని వైద్య రంగంలో ఔషధిగా గుర్తించడమే కాక ఇది వ్యాధినిరోధక శక్తిని పటిష్టం చేస్తుందని, కేన్సర్‌ను నిరోధి స్తుందని పరిశోధకులు వెల్లడిం చారు. మానవులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షిండానికి అనేక అధ్యయనాలు చేయవలసి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. గంజాయిలో ‘ఫైటో కెనాబినాయిడ్స్’ అనే రసాయనాలు ఉన్నాయి. ఇవి కేన్సర్ కణాలు రెట్టింపు కాకుండా ట్యూమర్లకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకుంటాయి. అనేక సంవత్సరాలుగా ప్రచారకుల నుంచి వస్తున్న ఒత్తిడుల ఫలితంగా బ్రిటన్ ప్రభుత్వం చట్టబద్ధమైన ఔషధంగా అనుమతించడానికి యోచిస్తున్న పరిస్థితుల్లో ఈ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. గతంలో నిర్వహించిన వంద అధ్యయనాలను సమీక్షించిన తరువాత జర్మనీకి చెందిన రోస్టాక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు గంజాయిలోని రసాయనాలు కేన్సర్‌తో పారాడగలవని వెల్లడించారు. కేన్సర్ నిరోధక ప్రయోజనాల కోసం గంజాయిని విస్తృతంగా వినియోగించుకోవలసి ఉందని అన్నారు. ఇంకా కేన్సర్ నిరోధక ఔషధాల అవసరం చాలా ఉందని అధ్యయన రచయిత ప్రొఫెసర్ బుర్ఖార్డ్ హింజ్ చెప్పారు. గంజాయి మొక్కలోని ఫైటో కెన్నా బినాయిడ్స్ మెదడును చైతన్యం చేస్తాయని, వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తాయని, ట్యూమర్ల నిరోధానికి వీలుగా పని చేస్తాయని చెప్పారు.

బ్రిటన్‌లో ప్రస్తుతం గంజాయిని అక్రమ ఔషధాల కేటగిరి 2 మందుగా పరిగణిస్తున్నారు. గంజాయిని ఎవరైతే తమ వద్ద భద్రపర్చుకుంటారో వారికి అయిదేళ్లు జైలుశిక్ష విధిస్తారు. రవాణా చేస్తే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఏదెలాగున్నా ఈ గంజాయి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సేవిస్తే ఆనందం పొందినట్టు భావనతో ఉంటారు. అతిగా దీన్ని సేవిస్తే మెదడు మొద్దుబారి, నిత్యం నిద్రావస్థలో ఉన్నట్టు అనిపిస్తుంది. అమెరికాలోని సగానికి పైగా రాష్ట్రాలు గంజాయిని వినియోగిస్తున్నాయి. గంజాయి నూనెలో పిచ్చితనాన్ని ప్రేరేపించే టిహెచ్‌సి (టెట్రోహైడ్రో కెనబినోల్) అనే రసాయనం ఇమిడి ఉంది. బ్రిటన్‌లో దీన్ని నిషేధించారు.
మన తెలంగాణ, సైన్స్ విభాగం