కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా కంబర్

ఢిల్లీ : ప్రముఖ కన్నడ కవి, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర కంబర్ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాహిత్య అకాడమీ అధ్యక్ష ఎన్నికల్లో మరాఠీ రచయిత బాల్‌చంద్ర వి. నెమాడే, ఒడిశా రచయిత ప్రతిభారయ్‌లతో ఆయన పోటీ పడ్డారు. కంబర్ ప్రస్తుతం అకాడమీ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ అకాడమీ అధ్యక్ష పదవి చేపట్టిన మూడో కన్నడ వ్యక్తి కంబర్ కావడం గమనార్హం. గతంలో కర్నాటకకు చెందిన వినాయక కృష్ణ గోకక్ (1983), […]

ఢిల్లీ : ప్రముఖ కన్నడ కవి, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర కంబర్ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాహిత్య అకాడమీ అధ్యక్ష ఎన్నికల్లో మరాఠీ రచయిత బాల్‌చంద్ర వి. నెమాడే, ఒడిశా రచయిత ప్రతిభారయ్‌లతో ఆయన పోటీ పడ్డారు. కంబర్ ప్రస్తుతం అకాడమీ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ అకాడమీ అధ్యక్ష పదవి చేపట్టిన మూడో కన్నడ వ్యక్తి కంబర్ కావడం గమనార్హం. గతంలో కర్నాటకకు చెందిన వినాయక కృష్ణ గోకక్ (1983), యుఆర్ అనంతమూర్తి (1993) అకాడమీ అధ్యక్షులుగా పని చేశారు. కంబర్ 1937, జనవరి 2న జన్మించారు. పలు కన్నడ సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. హంపిలోని కన్నడ యూనివర్సిటీ వ్యవస్థాపక విసిగా ఆయన పని చేస్తున్నారు. 1991లో సాహిత్య అకాడమీ అవార్డు, 2011లో జ్ఞానపీఠ్ అవార్డును ఆయన అందుకున్నారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. కంబర్ కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై పలువురు సాహితీ ప్రియులు హర్షం వ్యక్తం చేశారు. కంబర్‌కు శుభాభినందనలు తెలిపారు.

Cumber as President of Kendra Sahitya Academy Award

Related Stories: