కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు ఇద్దరు విద్యార్థినిల ఎంపిక…

Central Government scholarship

జనగామ : జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల (కొ-ఎడ్యుకెషన్) నుంచి ఇద్దరు విద్యార్థినులు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్స్ (ఎంహెచ్‌ఆర్‌డి-న్యూఢిల్లీ)కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జ్యోత్సారాణి తెలిపారు. ఇంటర్మీడియెట్ బోర్డు ఆధ్వర్యంలో వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు. డిగ్రీలో మూడేళ్లకు గాను రూ.30వేలు, పిజిలో రెండేళ్లకు గాను రూ.40వేలు మొత్తం రూ.70వేలు విద్యార్థుల ఖాతాల్లో నెలవారీగా జమచేయబడుతుందని తెలిపారు. కళాశాల నుంచి కె.శిరీష (బైపిసి), కె.సౌమ్య (బైపిసి) ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక కాగా వారిని అభినందించారు. కళాశాలలో విద్యార్థులకు ఉత్తమ విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బి.శ్రీనివాస్, డిఐఈవొ జనగామ పాల్గొని విద్యార్థులను అభినందించారు.