కేంద్ర ప్రభుత్వంపై యనమల ఫైర్

అమరావతి: ఎపి మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రం వేధింపు చర్యలకు పాల్పడుతోందని అగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మోడీని వ్యతిరేకించే పార్టీలను వేధింపులకు గురిచేస్తోందన్నారు. రేపు మాపో నోటీసులు రానున్నట్టు బిజెపి నేతలే చెబుతున్నారని యనమల అన్నారు. వైసిపి ఎంఎల్ఎ బుగ్గన ద్వారా బిజెపి తప్పుడు సమాచారం తెప్పించుకుంటోందని ఫైర్ అయ్యారు. ఓ పక్క జగన్, మరో పక్క పవన్ తో కలిసి బిజెపి రాజకీయ క్రీడ ప్రారంభించిందని చెప్పారు. అవినీతిపరుల అండతో […]

అమరావతి: ఎపి మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రం వేధింపు చర్యలకు పాల్పడుతోందని అగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మోడీని వ్యతిరేకించే పార్టీలను వేధింపులకు గురిచేస్తోందన్నారు. రేపు మాపో నోటీసులు రానున్నట్టు బిజెపి నేతలే చెబుతున్నారని యనమల అన్నారు. వైసిపి ఎంఎల్ఎ బుగ్గన ద్వారా బిజెపి తప్పుడు సమాచారం తెప్పించుకుంటోందని ఫైర్ అయ్యారు. ఓ పక్క జగన్, మరో పక్క పవన్ తో కలిసి బిజెపి రాజకీయ క్రీడ ప్రారంభించిందని చెప్పారు. అవినీతిపరుల అండతో ప్రజాదరణ ఉన్నవారిని కాలరాయాలని మోడీ సర్కార్ కుట్ర పన్నిందని ఆరోపణలు గుప్పించారు. రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కునే సత్తా లేక, కక్ష సాధించేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై పోరాటం ప్రారంభించామని చెప్పారు. కేంద్రంలోని బిజెపి నేతల కుట్రలను ప్రజలే తిప్పికొడతారని యనమల అన్నారు.

Comments

comments

Related Stories: