కేంద్ర పథకాలు ప్రజలకు అందేలా చూడాలి

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) ఛైర్మన్ ఎంపి పసునూరి దయాకర్, కో ఛైర్మన్ ఎంపి వినోద్‌కుమార్ అధికారులకు సూచించారు. శుక్రవారం అర్బన్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపి పసునూరి దయాకర్ అధ్యక్షతన జరిగింది.  ఈ […]

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) ఛైర్మన్ ఎంపి పసునూరి దయాకర్, కో ఛైర్మన్ ఎంపి వినోద్‌కుమార్ అధికారులకు సూచించారు. శుక్రవారం అర్బన్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపి పసునూరి దయాకర్ అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా వారు వాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు ప్రజలకు చేరువయ్యేలా చూడాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి కమిటీ సమావేశమై సమీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిత్యం అధికారులు, కమిటీ పర్యవేక్షణ చేయాల్సిన అవసరముందన్నారు. అభివృద్ధి పనులను, పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, సాధిస్తున్న ప్రగతి వివరాలను సమావేశంలో సమీక్షించారు. వరంగల్ నగర పాలక సంస్థకు నేరుగా అమృత్, స్మార్ట్ సిటీకి, 14 వ ఆర్థిక సంఘం నిధులు, హృదయ్ పథకం ద్వారా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బిఆర్‌జిఎఫ్, ఇతర పథకాల ద్వారా  జిల్లా పరిషత్ స్థానిక సంస్థలకు నేరుగా ఇచ్చే నిధులు నిలిపివేయడం మూలంగా జిల్లా పరిషత్ ద్వారా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని, ఇట్టి విషయాన్ని జాతీయ స్థాయిలో పార్లమెంట్ సభ్యులు మాట్లాడాల్సిన అవసరముందని కోరారు. పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతారావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించటానికి, పర్యవేక్షించటానికి వీలవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా, నగర కమిషనర్ గౌతమ్, జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ దయానంద్, డిఆర్‌డిఓ రాము, వివిధ శాఖల అధికారులు, మండల పరిషత్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: